ఎండిన ఎడారి బ్రతుకులో/Endina Edaari Brathukulo

ఎండిన ఎడారి బ్రతుకులో
నిండైన ఆశ నీవేగా
యేసు.. నిండైన ఆశ నీవేగా
తడబడెడు నా పాదములకు
తోడు నీవే గదా
యేసు.. తోడు నీవే సదా       ||ఎండిన||

ఎండమావులు చూచి నేను
అలసి వేసారితి (2)
జీవ జలముల ఊట నీవై
సేద దీర్చితివి
నా బలము నీవైతివే
యేసు.. బలము నీవైతివే

నిత్య మహిమకు నిలయుడా నీ
దివ్య కాంతిలోన (2)
నీదు ఆత్మతో నన్ను నింపి
ఫలింప జేసితివే
నా సారధి నీవైతివే
యేసు.. సారధి నీవైతివే

అంధకార లోయలెన్నో
ఎదురు నిలచినను (2)
గాయపడిన నీ హస్తమే నన్ను
గమ్యము చేర్చును
నా శరణు నీవే గదా
యేసు.. శరణు నీవే గదా       ||ఎండిన||

Endina Edaari Brathukulo
Nindaina Aasha Neevegaa
Yesu.. Nindaina Aasha Neevegaa
Thadabadedu Naa Paadamulaku
Thodu Neeve Gadaa
Yesu.. Thodu Neeve Sadaa        ||Endina||

Endamaavaulu Choochi Nenu
Alasi Vesaarithi (2)
Jeeva Jalamula Oota Neevai
Seda Deerchithive
Naa Balamu Neevaithive
Yesu.. Balamu Neevaithive

Nithya Mahimaku Nilayudaa Nee
Divya Kaanthilona (2)
Needu Aathmatho Nannu Nimpi
Phalimpa Jesithive
Naa Saaradhi Neevaithive
Yesu.. Saaradhi Neevaithive

Andhakaara Loyalenno
Eduru Nilachinanu (2)
Gaayapadina Nee Hasthame Nannu
Gamyamu Cherchunu
Naa Sharanu Neeve Gadaa
Yesu.. Sharanu Neeve Gadaa        ||Endina||

అవధులే లేనిది దివ్యమైన నీ కృప (హోసన్నా మినిస్ట్రీస్) / Avadhule Lenidi Divyamaina Nee Krupa (Hosanna Ministries )

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్

అవధులే లేనిది దివ్యమైన నీ కృప
అనంతమైనది ఆశ్చర్యమైనది (2)
యేసయ్యా నాపై నీవు చూపిన కృప
అమూల్యమైనది వర్ణించలేనిది (2)        ||అవధులే||

ఊహించలేని హృదయానందమును
దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు (2)
భారమెక్కువైనా తీరం కడుదూరమైనా
నీపై ఆనుకొందును
నేను గమ్యం చేరుకొందును (2)        ||అవధులే||

సరిపోల్చలేని మధురమైన అనుభవం
వింతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు (2)
సౌందర్యమైన అతిపరిశుద్ధమైన
నీ రూపము తలచుకొందును
నేను నీ కోసమే వేచియుందును (2)        ||అవధులే||

లెక్కించలేని అగ్ని శోధనలో
ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు (2)
వాడబారని కిరీటము నే పొందుటకు
వెనుకున్నవి మరచి
నేను లక్ష్యము వైపు సాగెద (2)        ||అవధులే||

Lyricist: Hosanna Ministries

Avadhule Lenidi Divyamaina Nee Krupa
Ananthamainadi Aascharyamainadi (2)
Yesayyaa Naapai Neevu Choopina Krupa
Amoolyamainadi Varninchalenidi (2)        ||Avadhule||

Oohinchaleni Hrudayaanandamunu
Dukhamunaku Prathigaa Dayachesinaavu (2)
Bhaaramekkuvainaa Theeram Kadu Dooramainaa
Neepai Aanukondunu
Nenu Gamyam Cherukondunu (2)        ||Avadhule||

Saripolchaleni Madhuramaina Anubhavam
Vinthaina Nee Premalo Anubhavimpajesaavu (2)
Soundaryamaina Athi Parishuddhamaina
Nee Roopamu Thalachukondunu
Nenu Nee Kosame Vechiyundunu (2)        ||Avadhule||

Lekkinchaleni Agni Shodhanalo
Prayaasamunaku Thagina Phalamulichchinaavu (2)
Vaadabaarani Kireetamu Ne Pondutaku
Venukunnavi Marachi
Nenu Lakshyamu Vaipu Saageda (2)        ||Avadhule||