ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము/Evari Kosamo Ee Praana Thyaagamu

ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము (2)
నీ కోసమే నా కోసమే
కలువరి పయనం – ఈ కలువరి పయనం (2)        ||ఎవరి||

ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందా
ఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2)
మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో
నడువలేని నడకలతో తడబడుతూ పోయావా
సోలి వాలి పోయావా….           ||ఎవరి||

జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళ కిరీటం నీకు పెట్టాము
జీవ జలములు మాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాము (2)
మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా
నీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటు పొడిచితిమి
తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు
వీరిని క్షమించు, వీరిని క్షమించు
అని వేడుకొన్నావా… పరమ తండ్రిని        ||ఎవరి||

Evari Kosamo Ee Praana Thyaagamu (2)
Nee Kosame Naa Kosame
Kaluvari Payanam – Ee Kaluvari Payanam (2)         ||Evari||

Ae Paapamu Erugani Neeku – Ee Paapa Lokame Siluva Vesindaa
Ae Neramu Theliyani Neeku – Anyaayapu Theerpune Ichchindaa (2)
Moyaleni Mraanutho Momu Paina Ummulatho
Naduvaleni Nadakalatho Thadabaduthu Poyaavaa
Soli Vaali Poyaavaa…         ||Evari||

Jeeva Kireetam Maaku Ichchaavu – Mulla Kireetam Neeku Pettaamu
Jeeva Jalamulu Maaku Ichchaavu – Chedu Chirakanu Neeku Ichchaamu (2)
Maa Prakkana Undi Mammu Kaapaaduchundagaa
Nee Prakkalo Ballemutho – Okka Potu Podichithimi
Thandri Veeru Cheyunadedo Veererugaru
Veerini Kshaminchu, Veerini Kshaminchu
Ani Vedukonnaavaa.. . Parama Thandrini          ||Evari||

ఆనందముగా యెహోవా (సీయోను గీతాలు) / Aanandamugaa Yehovaa(Songs of Zion)

పాట రచయిత: సీయోను గీతాలు

ఆనందముగా యెహోవా నీ కృపలన్ని
అన్ని కాలంబులందు కీర్తించెదన్ (2)

చావు గోతినుండి లెవనెత్తి నాకు – జీవమిచ్చిన జీవ దాత
వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో
సవ్యంబుగా ఈ భువియందున           ||ఆనందముగా||

సింహపు పిల్లలు – ఆకలిగొనిన- యెహొవ సహాయుడందరికి
ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు
అహా! ఏమందు నీ విశ్వాస్యతన్         ||ఆనందముగా||

ఎన్నెన్నో శోధన బాధలు రేగి – నన్ను కృంగదీయ పోరాడినన్
ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన
కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్       ||ఆనందముగా||

పర్వతంబులు – పారిపోయినను- ఉర్విలోమార్పు కలిగిననూ
తరుణములు విరోధముగపై లేచినా –
స్మరియించెద నీ విశ్వాస్యతన్             ||ఆనందముగా||

Lyricist: Songs of Zion

Aanandamugaa Yehovaa Nee Krupaalanni
Anni Kaalambulandu Keerthinchedan (2)

Chaavu Gothinundi Levaneththi Naaku – Jeevamichchina Jeeva Daatha
Vivarinthu Ne Needu Vishwaasyatha Nenthayo
Savyambugaa Ee Bhuviyanduna           ||Aanandamugaa||

Simhapu Pillalu – Aakaligonina- Yehova Sahaayu Dandariki
Ihamandunaa Ae Melu Koduva Yundadu
Aaha! Emandu Nee Vishwaasyathan       ||Aanandamugaa||

Ennenno Shodhana Baadhalu Regi – Nannu Krungadeeya Poraadinan
Ghanamaina Nee Vishwaasyathan Naaku Choopina
Kanna Thandri Ninnu Koniyaadedan       ||Aanandamugaa||

Parvathambulu – Paaripoyinanu- Urvilo Maarpu Kaliginanoo
Tharunamulu Virodhamuga Pai Lechinaa-
Smariyincheda Nee Vishwasyathan         ||Aanandamugaa||