నీ జీవితం క్షణ భంగురం / Nee Jeevitham Kshana Bhanguram

నీ జీవితం క్షణ భంగురం
గమ్యంబులేని వేదనల వలయం (2)
నీ పాప హృదయం తెరువుము ఈ క్షణం (2)
దేవుని ప్రేమను రుచి చూడు ఈ క్షణం          ||నీ జీవితం||

ఏది సత్యం ఏది నిత్యం – ఏది మాన్యం ఏది శూన్యం
సరి చూసుకో ఇప్పుడే – సరి చేసుకో (2)
ప్రభు యేసు నీ కొరకు బలి ఆయె కల్వరిలో
గమనించుమా ప్రియ నేస్తమా (2)          ||నీ జీవితం||

కష్టాలు ఎన్నైనా నష్టాలు ఎదురైనా
నీ సర్వ భారమంతా – యేసు పైన వేయుమా (2)
నీ హృదయ భారం తీరును ఈ క్షణం
దిగులు పడకుమా ప్రియ నేస్తమా (2)         ||నీ జీవితం||

Nee Jeevitham Kshana Bhanguram
Gamyambuleni Vedhanala Valayam (2)
Nee Paapa Hrudayam Theruvumu Ee Kshanam (2)
Devuni Premanu Ruchi Choodu Ee Kshanam          ||Nee Jeevitham||

Aedhi Sathyam Aedhi Nithyam – Aedhi Maanyam Aedhi Shoonyam
Sari Choosuko Ippude – Sari Chesuko (2)
Prabhu Yesu Nee Koraku Bali Aaye Kalvarilo
Gamaninchumaa Priya Nesthamaa (2)         ||Nee Jeevitham||

Kashtaalu Ennainaa Nashtaalu Edurainaa
Nee Sarva Bhaaramanthaa – Yesu Paina Veyumaa (2)
Nee Hrudaya Bhaaram Theerunu Ee Kshanam
Digulu Padakumaa Priya Nesthamaa (2)         ||Nee Jeevitham||

నీ జీవితం క్షణ భంగురం / Nee Jeevitham Kshana Bhanguram

నీ జీవితం క్షణ భంగురం
నీ యవ్వనం తృణాప్రాయం
ఎప్పుడు రాలునో ఎవరు ఎరుగరు
ఎప్పుడు పోవునో నీకు తెలియదు
ప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగా
పరిహాసమేల ఓ సోదరా
ప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగా
పరిహాసమేల ఓ సోదరీ
పరిహాసమేల ఓ సోదరా… పరిహాసమేల ఓ సోదరీ…

ఈ రెండు మార్గములు నీ ఎదుటనున్నవి
విశాల మార్గమొకటి – ఇరుకు మార్గమొకటి (2)
ఏది నీ మార్గమో – ఈ క్షణమే తేల్చుకో (2)
ఈ క్షణమే తేల్చుకో       ||నీ జీవితం||

నీకున్నవన్నియు క్షణిక సుఖములే
ప్రభు యేసుని చేరు – పరలోకమే నీదవును (2)
ఈ దినమే సుదినము – ప్రభుని హృదిని చేర్చుకో (2)
ప్రభుని హృదిని చేర్చుకో      ||నీ జీవితం||

Nee Jeevitham Kshana Bhanguram
Nee Yavvanam Thrunaapraayam
Eppudu Raaluno Evaru Erugaru
Eppudu Povuno Neeku Theliyadu
Prabhu Yesu Priyamaara Ninnu Piluchuchundagaa
Parihaasamela O Sodaraa
Prabhu Yesu Priyamaara Ninnu Piluchuchundagaa
Parihaasamela O Sodaree
Parihaasamela O Sodaraa
Parihaasamela O Sodaree

Ee Rendu Maargamulu Nee Yedutanunnavi
Vishaala Maargamokati – Iruku Maargamokati (2)
Edi Nee Maargamo – Ee Kshaname Thelchuko (2)
Ee Kshaname Thelchuko       ||Nee Jeevitham||

Neekunnavanniyu Kshanika Sukhamule
Prabhu Yesuni Cheru – Paralokame Needavunu (2)
Ee Diname Sudinamu – Prabhuni Hrudini Cherchuko (2)
Prabhuni Hrudini Cherchuko      ||Nee Jeevitham||