నా దోనెలో యేసుంటే / Naa Donelo Yesunte

నా దోనెలో యేసుంటే

నడుపుతుంటే

నాకేమి భయము లేదుగా

చీకటులు కమ్ముకున్నా

చుట్టు అలలు ఉన్నా

ఏ అపాయము రాదుగా

1. సముద్రమును కలిగించిన

శక్తిగల దేవుడు

గాలిని గద్దిస్తాడుగా

తుఫాను ఆపేస్తాడుగా

సమస్యలను సరిచేసే

యేసుక్రీస్తు దేవుడు

నా దాకా రానీయడుగా

ఇబ్బంది పడనీయడుగా                   ॥నా॥

2. నా గమ్యం నియమించిన

పరలోక దేవుడు

మార్గము చూపిస్తాడుగా

సరిగా నడిపిస్తాడుగా

కునుకకుండా కాపాడి

తండ్రియైన దేవుడు

నన్ను రక్షిస్తాడుగా

సంతోషమిస్తాడుగా                        

చిన్నవాడను యేసయ్యా / Chinnavaadanu Yesayya

చిన్నవాడను యేసయ్యా

నన్ను ఆశీర్వదించుమయా

నీ శక్తితో నడుపుమయా

నన్ను ఎన్నడు విడువకయా

1. బలహీనుడను యేసయ్యా

నిలకడలేని వాడనయా

దావీదు వలెనే

గొప్పపనులు చేయ

బలముతో నింపుమయా                                ॥చిన్న॥

2. బుద్ధిహీనుడనూ యేసయ్యా

ఒట్టి పశువును నేనయ్యా

సొలొమోనువలెనే గొప్ప

పనులు చేయ జ్ఞానముతో

నింపుమయా                                     ॥చిన్న॥

నిజముగా మొరపెట్టినా / Nijamugaa Mora Pettina

నిజముగా మొరపెట్టినా

దేవుడాలకించకుండునా

సహనముతో కనిపెట్టినా

సమాధానమియ్యకుండునా

జీవముగల దేవుడు

మౌనముగా ఉండునా

తన పిల్లలకాయన

మేలుచేయకుండునా

1. పరలోక తండ్రినడిగినా

మంచి యీవులియ్యకుండునా

కరములెత్తి ప్రార్ధించినా

దీవెనలే కురియకుండునా                            ॥జీవ॥

2. సృష్టికర్తయైన వానికి

మన అక్కర తెలియకుండునా

సరియైన సమయానికి

దయచేయక ఊరుకుండునా                      ॥జీవ॥

నమ్మదగిన దేవుని వెంబడిరచిన / Nammadagina Devuni Vembadirachina

నమ్మదగిన దేవుని వెంబడిరచిన

నమ్మకత్వము కలిగి జీవించిన

ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు

సాతాను నిన్ను ముట్టడు

1. యోసేపును ఆపదలో రక్షించెను

ఫలియించెడి కొమ్మగా హెచ్చించెను

ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు.

తనతో రమ్మని నిన్ను

అడుగుచున్నాడు                              ॥నమ్మ॥

2. దావీదును రాజుగా

అభిషేకించెను

ప్రియమైన సేవకునిగా

రూపించెను

ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు.

తనతో రమ్మని నిన్ను

అడుగుచున్నాడు.                             ॥నమ్మ॥

3. మోషేను నాయకునిగా

నియమించెను తన ప్రజలకు

దీవెనకరముగా ఉంచెను

ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు.

తనతో రమ్మని నిన్ను

అడుగుచున్నాడు                              ॥నమ్మ॥

వీరులం యేసుసైన్యపు ధీరులం / Veerulam Yesu sainaypu Dheerulam

వీరులం యేసుసైన్యపు ధీరులం

శూరులం క్రీస్తురాజ్యపు పౌరులం

సత్యముతో నడుము బిగించి

సర్వాంగ కవచము ధరించి

దురాత్మలతో పోరాడెదం

సాతానుని జయించెదం (2)

చూచుచున్న దేవునికి తెలుసులే / Choochuchunna Devuniki Thelusule

చూచుచున్న దేవునికి తెలుసులే

నా అక్కరలేవో ఆయన ఎరుగులే

అ.ప: భయపడక సాగెదన్‌ నిశ్చింతగ

నుండెదన్ నా భారమంత

యేసుపైన మోపెదన్‌

1. వినుచున్న దేవునికి తెలుసులే

నా కోరికలేవో ఆయన ఎరుగులే ? భయ?

2. నాతోనున్న దేవునికి తెలుసులే

నా కష్టాలేవో ఆయన ఎరుగులే ?భయ?

మంచి కాపరి / Manchi Kaapari

మంచి కాపరి

ఎంత ప్రేమతో నన్ను కోరి

దారి తప్పిన నన్ను చేరి

చేర్చినాడు తన దరి                           ॥మంచి॥

1. పచ్చికగల చోటులో

విశ్రమింపజేయును

శాంతికరపు జలముల

చెంతను నడిపించును                    ॥మంచి॥

2. అంధకార లోయలో

తిరిగినా నే వెరువను

దుడ్డుకర్ర దండము

నన్ను ఆదరించును                          ॥మంచి॥

యేసుపై నుండి చూపు మరల్చక / Yesu Pai Nundi Choopu Maralchaka

యేసుపై నుండి చూపు మరల్చక

పయనం సాగించు

అల్పవిశ్వాసమునకు చోటియ్యక

విజయము సాధించు

1. నీవు వెళ్ళేది యేసు చెంతకు

గాలి వైపునకు చూచుటెందుకు (2)

నీటి మీద బాట చూపిన

ప్రభువు నీదు చేయి విడచునా

నీ దృష్టి మార్చకు

నీ పట్టు విడువకు                               ॥యేసు॥

నా చిన్ని హృదయంలో / Naa Chinni Hrudayamlo

పాట రచయిత: షారోన్ ఫిలిప్
Lyricist: Sharon Philip

నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు (4)
తన ప్రేమనే మాకు చూపి
తన వారసులుగా మము చేసెను
నాలో సంతోషం నాలో ఉత్సాహం
యేసయ్య నింపాడు (4)

లాలించును నను పాలించును
ఏ కీడు రాకుండా నను కాపాడును (2)
తన అరచేతిలో నన్ను చెక్కుకొనెను
ముదిమి వచ్చుఁవరకు నన్ను ఎత్తుకొనును         ||నాలో||

హత్తుకొనును నను ఓదార్చును
ఎల్లప్పుడూ నాకు తోడుండును (2)
అన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చినా
మన ప్రభు యేసుపై నీవు ఆనుకొనుము         ||నాలో||

పాట రచయిత: షారోన్ ఫిలిప్
Lyricist: Sharon Philip

Naa Chinni Hrudayamlo Yesu Unnaadu (4)
Thana Premane Maaku Choopi
Thana Vaarasulugaa Mamu Chesenu
Naalo Santhosham Naalo Uthsaaham
Yesayye Nimpaadu (4)

Laalinchunu Nanu Paalinchunu
Ae Keedu Raakundaa Nanu Kaapaadunu (2)
Thana Arachethilo Nannu Chekkukonenu
Mudimi Vachchuvaraku Nannu Etthukonunu         ||Naalo||

Hatthukonunu Nanu Odaarchunu
Ellappudu Naaku Thodundunu (2)
Anni Kashtaalu Nashtaalu Edurochchinaa
Mana Prabhu Yesupai Neevu Aanukonumu         ||Naalo||

విశ్వాస వీరులం / Viswasa Veerulam

విశ్వాస వీరులం

విజయమునే కోరెదం

విశ్వసించి యేసుని

విశ్వమునే జయింతుము

1. నమ్మదగిన దేవుడు మాకుండగా

నమ్మిన సమస్తము

సాధ్యమేగదా                      ॥విశ్వా॥

2. విశ్వాసమే మమ్మును

రక్షించ

విశ్వాసమే నిత్యము

పరీక్షించ                             ॥విశ్వా॥