మన తండ్రి / Mana Thandri

మన తండ్రి

మన తండ్రి దేవుడు దేవుడే

అన్ని ఇచ్చిన దేవుడే

ప్రేమ రూపుడైన దేవుడే (2)

1. చిన్ని పిచ్చుక నీకు ఎగురుట

ఎవరు నేర్పిరి

2. చిన్ని పుష్పమా నీకు

అందమెవరిచ్చిరి

3. రంగు రంగు చేపల్లారా.

ఈదుట ఎవరు నేర్పిరి

4. పకపక నవ్వే పాపాయి

నవ్వుట ఎవరు నేర్పిరి ?మన?

బండ మీద నీ యిల్లు కట్టుకో / Banda Meeda Illu Kattuko

బండ మీద నీ యిల్లు కట్టుకో

యేసే ఆ బండయని తెలుసుకో

బుద్ధిగలవాడవై మసలుకో

స్థిరముగా నీ యిల్లు నిలుపుకో

1. వాన కురిసినా వదరు వచ్చినా

బలమైన గాలి వీచినా

యిల్లు నిలుచును

క్షేమము నీకిచ్చును

నూనెతో నీ దివ్వెను నింపుకో

సిద్ధముగా ఉండ నీవు నేర్చుకో

బుద్ధిగలదానవై మసలుకో

వరుడేసుని ఎదుర్కొనగా మేలుకో

2. బూర మ్రోగగా తలుపు తెరవగా

పెండ్లికొడుకు ఏతెంచెగా

లోన ప్రవేశింతువు

విందులో పాల్గొందువు

నా తల్లికన్నా నా తండ్రికన్నా / Naa Thallikanna Naa Thandrikanna

నా తల్లికన్నా నా తండ్రికన్నా

ఎంతో మంచివాడు నా పరమతండ్రి

నా అక్కకన్నా నా అన్నకన్నా

మిన్నయైన వాడు పరలోకతండ్రి

1. నాన్నా అని పిలిచినప్పుడే

నా వైపు చూస్తాడు నా తండ్రి

ఆకలి అని అడిగినప్పుడే

భోజనం పెడుతుంది నా తల్లి

నేడగక ముందే నాకేమి కావాలో 2

అన్నీ నాకిస్తాడు పరమతండ్రి

2. ఎంత ప్రేమ నామీదున్నా

కొంతకాలమే తోడుంటాడు నా అన్న

ఎంత శ్రద్ధ నా మీదున్నా

కొన్నిరోజులే నన్ను చూస్తుంది నా అక్క

ఎల్లప్పుడు నాతోనుండి కంటిపాపవలె

నన్ను కాపాడుతుంటాడు పరమతండ్రి

నమ్ముట నీవలననైతే / Nammuta Neevalanaithe

నమ్ముట నీవలననైతే

సమస్తము సాధ్యమే

నమ్మికతో ప్రార్ధించితే

సర్వము నీ వశమే

1 నమ్మికతో సింహాల

నోళ్ళ మూయబడెను

నమ్మికతో అగ్నిబలము

2 నమ్మికతో సముద్రమే

పాయలుగా చీలెను.

నమ్మికతో ప్రాకారపు

3. నమ్మికతో ఎందరికో

స్వస్థత కలిగెను

నమ్మికతో పాపపు

బంధకాలే తొలిగెను                        ॥నమ్ము॥

విశాల నీలాకాశంలో / Vishala Nellakashamlo

విశాల నీలాకాశంలో

వింతైన అంతరిక్షంలో

ఎత్తైన పర్వత శ్రేణులలో

లోతైన పచ్చని లోయలలో (2)

దేవుని చేతిపని

ప్రచురమగుచున్నది

యేసుక్రీస్తు మహిమ

వివరించబడుచున్నది

1. మిలమిల మెరిసే తారలలో

కిలకిల అరిచే పక్షులలో

గలగల ఉరికే ఏరులలో

కళకళ వెలిగే చిన్నారులలో                           ॥దేవు ॥

గొప్ప గొప్ప గొప్ప దేవుడు / Goppa Goppa Goppa Devudu

గొప్ప గొప్ప గొప్ప దేవుడు

ప్రేమగల యేసు దేవుడు

1. మాటతో సృష్టిని చేసినాడు.

మనిషిలో జీవం పోసినాడు.

2. లోకమును ప్రేమించినాడు.

సిలువలో ప్రాణమర్పించినాడు

3. అన్నివేళలా నాతో ఉండువాడు

ఎప్పుడూ సహాయం చేయువాడు

ముద్దుబిడ్డగా ఉండాలేవా యేసుస్వామికి / Muddu Biddagaa Undaleda Yesuswamiki

ముద్దుబిడ్డగా ఉండాలేవా

యేసుస్వామికి

ముద్దుబిడ్డగా ఉండాలేవా

1. అపవిత్రపరచే రాజభోజనము

మాకొద్దని జయమొందిన

దానియేలు షడ్రక్‌ మెషక్‌

అబెద్నెగోవలె

వద్దువద్దని చెప్పలేవా

లోకాశలకు వద్దువద్దని చెప్పలేవా

2. యజమానుని భార్య తనను

ప్రేరేపించినా కాని నేను పాపం

చేయనని పారిపోయిన యోసేపు

దూరంగా పారిపోలేవా

పాపమునకు దూరంగా

పారిపోలేవా

3. బయలు ప్రవక్తలెందరొ ఎదురు

నిలిచిన గాని ప్రార్ధనతో గెలిచి

వారిని హతమార్చిన ఏలీయావలె

ధైర్యంగా ఎదిరించలేవా

సైతానును ధైర్యంగా

ఎదిరించలేవా

వెలుగైన యేసు దేవుడు / Velugaina Yesu Deevudu

వెలుగైన యేసు దేవుడు

వెలుగు కలుగజేసిన వాడు

తన వెలుగును వెదజల్లుటకు

లోకములో నిన్ను నన్నుంచాడు.

లెమ్ము లోకమును వెలిగించుము

మండే జ్వాలవై ప్రకాశించుము

1. యేసుని వెంబడిరచువారు

చీకటిలో నడువలేరు

జీవపు కాంతులు కలిగి

ధరణిలో వెలుగొందెదరు

2. యేసుని ఎరుగని వారు

చీకటిలో నడచుచున్నారు

నిజమైన వెలుగును పొంద

మార్గము చూప బయలుదేరు

చిన్న చిన్న పిల్లల / Chinna Chinna Pillala

చిన్న చిన్న పిల్లల

చిట్టి చిట్టి చేతులు

చిన్నతనపు అల్లరితో

ముద్దులొలుకు చుండును

ఆ చేతులకు మంచి పనులు

చేయుటను నేర్పింతమా

మన చేతులతో మంచితనపు

మార్గమందు నడిపింతమా

1. ఆ చేతులే బైబిలు పట్టి

ఎందరినో రక్షించవచ్చును

ఆ చేతులే తుపాకి పట్టి

విధ్వంశం సృష్టించవచ్చును

2. ఆ చేతులే పియాను మీద

సంగీతం పలికించవచ్చును

ఆ చేతులే మోసం చేసే

జూదపు చక్రం తిప్పవచ్చును

3. ఆ చేతులే కుష్టురోగుల

గాయాలను కట్టవచ్చును

ఆ చేతులే మత్తుమందులతో

నిలకడలేక వణకవచ్చును

పక్షిరాజు యౌవ్వనంవలె / Pakshiraaju Yevanamvale

పక్షిరాజు యౌవ్వనంవలె

దినదినము శక్తిపొందెదం (2)

ప్రతిరోజూ నూతనమైన

మేలులతో తృప్తిపొందెదం (2)

యేసు కొరకు నిలిచెదమా

అపవాదిని గెలిచెదమా    (2) ॥పక్షి॥

1. యుద్ధభూమిలో ప్రజలను నడుప

నాయకులుగా ఎదిగెదమా

సిలువ బాటలో జనులను నిలుప

యోధులుగా కదిలెదమా                                ॥యేసు॥

2. ద్రాక్షతోటలో పనిచేయుటకై

మన చేతులు కలిపెదమా

సాక్ష్యమిచ్చుచూ ప్రజలందరికీ

యేసువార్త తెలిపెదమా                  ॥యేసు॥