నేను మంచి బాలుడను
యేసయ్య బిడ్డను
1. పనికి రానిది మాట్లాడను
పొరుగు వానితో పోట్లాడను
యేసు కొరకు సాక్షిగ
ఇలను జీవింతును
2. తల్లిదండ్రుల మాట విందును
అందరికి మాదిరిగా ఉందును
యేసు కొరకు సాక్షిగ
జీవింతును
నేను మంచి బాలుడను
యేసయ్య బిడ్డను
1. పనికి రానిది మాట్లాడను
పొరుగు వానితో పోట్లాడను
యేసు కొరకు సాక్షిగ
ఇలను జీవింతును
2. తల్లిదండ్రుల మాట విందును
అందరికి మాదిరిగా ఉందును
యేసు కొరకు సాక్షిగ
జీవింతును
బేత్లహేము పురమునకు
నే పోతూ ఉన్నాను.
బాలయేసును చూచి
తిరిగి వస్తాను
1. ఎంతో గొప్ప దేవుడు
పాకలో పుట్టాడు.
దూతలు దిగివచ్చారు.
పాటలు పాడారు
2. గొల్లలెందరో వచ్చారు.
యేసుకు మొక్కారు
తూర్పు జ్ఞానులు వచ్చారు.
కానుకలిచ్చారు.
యేసు సిపాయిని - సిపాయిని
మా విరోధి సాతానున్
మట్టు పెట్టెదన్
1. పొంచి పొంచి వచ్చుచున్న
సాతానున్ వాక్యమనే ఖడ్గముతో
తరిమి వేతును
2. అపవాది వేయుచున్న అగ్ని
బాణముల్ విశ్వాసపు డాలుతో
ఆపివేతును
ప్రార్థన చేతును అనుదినము
దేవుని శక్తిని పొందెదను
యేసయ్యతో మాట్లాడెదను
తండ్రితో గడిపెదను
1. యేసు ప్రభువు ప్రార్ధించెను
సాతాను శోధన గెల్చెను
నేను కూడా ప్రార్ధన చేసి
సాతానుని ఓడించెదను
2. సంఘమంత ప్రార్ధించెను
చెరసాల పునాది కదిలెను
నేను కూడా ప్రార్ధన చేసి
పాపపు గోడలు కూల్చెదను
యేసయ్య గురించి
ఎపుడైనా విన్నావా
ఆ తండ్రి ప్రేమను నీవు
తెలుసుకున్నావా
1. పాపులమైన మన కొరకు
రక్తం కార్చి ప్రాణంపెట్టి
తిరిగి లేచి చేతులు చాచి
పిలుచుచున్నాడు
2. పాపాలన్ని ఒప్పుకుంటే
క్షమించి వేస్తాడు.
నీతిమంతులుగా మార్చి
పరలోకం ఇస్తాడు.
టివిలో ప్రేమ చిన్నబోయింది
సినిమాలో ప్రేమ తెల్లబోయింది
కలువరిలో ప్రేమ
వెలిగిపోయింది
దాని ముందు లోక ప్రేమ
వెలసిపోయింది
ఏ ప్రేమ కావాలి నీకు?
ఏ ప్రేమ కావాలి?
చిన్న పిల్లలం
మేము చిన్న పిల్లలం
సిలువ ప్రేమ చాట వెళ్ళే
క్రీస్తు పౌరులం
ఇరుగు పొరుగు వారిని ప్రేమించెదం
వర్ణ వర్గ భేదాలు ద్వేషించెదం
అందరం ఏకమై
అందరం ఐక్యమై
సిలువ ప్రేమ చాట వెళ్ళే
క్రీస్తు పౌరులం
నాలాంటి చిన్నలంటే
యేసయ్యకిష్టం
మాలాంటి వారిదే పరలోకరాజ్యం
1. మనసు మారి చిన్న పిల్లలవంటి
వారలైతేనే పరలోక రాజ్యమని
యేసు చెప్పెను (2)
2. నాలాంటి చిన్నవారిని
యేసయ్యఎత్తుకొని
ముద్దాడి ముచ్చటించి దీవించెను
ఇదే దినం ఇదే దినం
ప్రభు చేసినది ప్రభు చేసినది.
ఉత్సాహం ఉత్సాహంచి
స్తుతి పాడెదము స్తుతి పాడెదము
ఇదే దినం ప్రభు చేసినది
ఉత్సాహంచి స్తుతి పాడెదము
ఇదే దిన ఇదే దినం
ప్రభు చేసినది.
చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు
యేసయ్య ఎవరో తెలుసా నీకు
ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు
1. పాపులను రక్షించగా
ఈ భువికి ఏతెంచెగా
నిన్ను నన్ను రక్షింప
మరియమ్మ గర్భాన
ఉదయించెగా (3)
2. యేసయ్యనే నమ్మిన
నీ హృదయమర్పించిన
విలువైన రక్షణ పరలోకభాగ్యమే
నీకిచ్చును (3)