తల్లి మరచినా తండ్రి విడచినా / Thalli Marachina Thandri Marachina

తల్లి మరచినా తండ్రి విడచినా

నిన్ను నేను విడువను

ఎడబాయను అనెను

నాదు కాపరి యేసు నా గురి

1 కష్టమొచ్చినా నష్టమొచ్చినా                ॥నిన్ను॥

2 వ్యాధి కలిగినా బాధ కలిగినా ॥నిన్ను॥

బంగారు నగరిలో నా కొరకు / Bangaaru Nagarilo Naa Koraku

బంగారు నగరిలో నా కొరకు

ఇల్లు కట్టెను నా యేసు రాజు

సుందరమైన నగరం

రత్నాల రాశుల పరమపురం

1. తానుండె చోటుకు కొనిపోవుటకును

రానుండె నా యేసురాజు

బాధలు లేని నగరం

రోదన ఎరుగని పరమపురం

2. నీవును యేసుని అంగీకరించిన

కట్టును నీకు ఇల్లు

ఆకలి లేని నగరం

చీకటి కానని పరమపురం

కోయిలమ్మ పాటలో / Koilamma Paatalo

కోయిలమ్మ పాటలో

రాచిలుక మాటలో

దేవునికి మహిమయున్నది

అ.ప: ఓ తమ్ముడా ఓ చెల్లెలా

నీ నోట దేవుని స్తుతియున్నదా

1. వీచే చిరుగాలిలో

పూచే మరుమల్లెలో

దేవునికి మహిమయున్నది                   ॥ఓ॥

2. పారే సెలయేటిలో

సాగే మేఘాలలో దేవునికి మహిమయున్నది

కోయిలమ్మ పాటలో / Koyilamma Patalo

కోయిలమ్మ పాటలో

రాచిలుక మాటలో

దేవునికి మహిమయున్నది

అ.ప: ఓ తమ్ముడా ఓ చెల్లెలా

నీ నోట దేవుని స్తుతియున్నదా

1. వీచే చిరుగాలిలో

పూచే మరుమల్లెలో

దేవునికి మహిమయున్నది                            ॥ఓ॥

2. పారే సెలయేటిలో

సాగే మేఘాలలో

దేవునికి మహిమయున్నది                            ॥ఓ॥

చిరుచిరుప్రాయపు చిన్నారులం / Chiru Chiru Prayapu Chinnarulam

చిరుచిరుప్రాయపు చిన్నారులం

బుడిబుడి నడకల బుజ్జాయిలం

యేసయ్య ప్రేమించిన బాలలం

యేసయ్య రాజ్యపు వారసులం

1. దేవుని వాక్యము ధ్యానించుతాం

విడువక నిత్యము ప్రార్ధించుతాం

దేవుని ప్రేమను చాటించుతాం

ఆయన కృపను పాడుతాం

2. అల్లరి చేయుట మేమెరుగం

తుంటరి పనులకు దరిచేరం

అమ్మానాన్నకు విధేయులం

అందరి దయకు పాత్రులం

ఎంతో మంచివాడు యేసుస్వామి / Yentho Manchi Vaadu Yesu Swamy

ఎంతో మంచివాడు యేసుస్వామి

ఎంతెంతో ప్రేమించాడు.

ప్రతివారిని

1. పరమును విడచి

ధరణికి వచ్చాడు.

సిలువలో నిలచి

ప్రాణమే ఇచ్చాడు.

2. విశ్వసించువారు

నశియింపరన్నాడు

నిత్యజీవమొందగ

అనుగ్రహం చూపాడు

చిన్ని నావ నాది / Chinni Naava Naadi

చిన్ని నావ నాది

సాగిపోవుచున్నది

లోకమనే సంద్రములో

1. నా నావికుడు యేసే

నా నాయకుడు యేసే

నా నావలో యేసు ఉన్నాడు.

నా నావను నడిపించుచున్నాడు.

2. అలలు పైకి లేచినా

గాలి విసిరికొట్టినా

నా నావలో యేసు ఉన్నాడు.

తుఫానును గద్దించుచున్నాడు.

ఒంటరినై యున్నానని / ontarinai unnanani

ఒంటరినై యున్నానని

తోడెవ్వరు లేరేయని

దిగులుతో నీవున్నావా

నిరాశ పడుతున్నావా

1. యేసయ్య మంచి స్నేహితుడు

నీ కొరకు వేచియున్నాడు

ఆయన చెంతకు చేరుమా

పరమానందము పొందుమా

2. యేసయ్య మంచి దేవుడు

నీ కొరకు ప్రాణమిచ్చాడు.

ఆయన శరణం వేడుమా

రక్షణ భాగ్యము పొందుమా

యేసయ్య మాట జీవపు ఊట / Yesayya Maata Jeevapu Oota

యేసయ్య మాట జీవపు ఊట

పరముకు నడిపించు బాట

1. కత్తివలె ఖండిరచును

సుత్తివలె సరిచేయును

విలువైనది బలమైనది

నా యేసు నీ నోటిమాట

2. దీపంవలె వెలిగించును

అద్దంవలె సరిచేయును

విలువైనది బలమైనది

నా యేసు నీ నోటిమాట

3. తేనెవలె మధురము

నూనె శ్రేష్ఠము

విలువైనది బలమైనది

నా యేసు నీ నోటిమాట

నాకొక స్నేహితుడున్నాడు / Naa Koka Snehithudu unnadu

నాకొక స్నేహితుడున్నాడు.

నేనున్నాను భయపడకన్నాడు

ఆయనే యేసు-నాప్రియ యేసు

1. నా పాపం కొరకు

ఆ సిల్వ మోసాడు

తన ప్రాణమునిచ్చి

నాకు జీవం పోసాడు                       ॥ఆయనే॥

2. ఆపద వేళల్లో

నా వెంట ఉంటాడు.

నా ఆనందంలో పాలు

పంచుకుంటాడు                               ॥ఆయనే॥

3. నేనేది అడిగినా

వెనువెంటనే ఇస్తాడు

నిదురే పోకుండా

తను కావలి కాస్తాడు                        ॥ఆయనే॥