దగ్గరగా దగ్గరగా / Daggaragaa Daggaragaa

దగ్గరగా దగ్గరగా

యేసుకు దగ్గరగా సాగిపో

చేరువగా చేరువగా

పైపైకి చేరువగా ఎక్కిపో

1. దినదినము క్షణక్షణము

వాక్యములో ప్రార్ధనలో

ఉన్నత శిఖరం ఎక్కిపో

పరలోక మహిమకు సాగిపో

2. శోధనలో వేదనలో

కష్టములో నష్టములో

అలయక సొలయక ఎక్కిపో రక్షకుని వెంట సాగిపో

చెంతకు చేరుమని / Chenthaku Cherumani

చెంతకు చేరుమని

విశ్రాంతిని పొందుమని

ప్రేమతో ప్రభుపిలిచే

నీ కొరకై నిలిచే

1. ప్రయాసతో పాపభారము

మోయుచుంటివా

యేసు స్వరము వినుము

ప్రభు ప్రేమను గనుము ?చెంత?

2. నిరాశతో నిస్పృహతో

కృంగియుంటివా

అందుకో ప్రభుచేయి

పొందుము ఎంతో హాయి? చెంత?

ఏర్పరచబడిన వారలం / Erparachabadina Vaaralam

ఏర్పరచబడిన వారలం

యేసుకు ప్రియపుత్రులం

ఎన్నిక గలిగిన పాత్రలం

కాదు మేం అల్పులం

1. మమ్ము కాపాడుటకు

తన దూతలను

మా కొరకై ఏర్పరచెను

చిన్నరాయైనను

తగలనీయక పగలురాత్రి

కావలియుంచెను

2. మాకు ఆటంకమే కలిగించక

తన యొద్దకు రానిమ్మనెను

మాలో ఒక్కరినైనా తృణీకరించుట

తగదని సెలవిచ్చెను

దేవుని పనికై కానుకలీయుమా / Devuni Panikai Kaanukaleeyumaa

దేవుని పనికై కానుకలీయుమా

ఆయనిచ్చు మేళ్ళు పొందుమా

నీవిచ్చినది కొంచెమైనను

నీ ఫలములు విస్తారములగును

1. విధవరాలు ఇచ్చినవి

రెండు కాసులైనను

తన జీవనమంతయు ఇచ్చివేసెను

నీవిచ్చినది కొంచెమైనను

నీ ఫలములు విస్తారములగును

2. మాసిదోనియ సంఘస్థులు

బీదలైనను బహు దాతృత్వము

కలిగి ప్రభునకిచ్చిరి

నీవిచ్చినది కొంచెమైనను

నీ ఫలములు విస్తారములగును

నాకు ముందుగా యేసు ఉన్నాడు / Naaku Mundugaa Yesuunnadu

నాకు ముందుగా

యేసు ఉన్నాడు.

నేను వెళ్ళు త్రోవ

ఆయన ఎరిగియున్నాడు.

నా క్షేమం కోరువాడు

నాకు దారిచూపు వాడు

నన్ను నడిపించువాడు

యేసు దేవుడు

1. అందని మహకొండలైనా

అంధకార లోయలైనా

ఎంతమాత్రం నా చేయి

విడువనని చెప్పినాడు

కొంచెమైనా నా కాలు

జారనీయుడు

2. బెదిరించే ఎండలైనా

వణికించె చలులైనా

ఎంతదూరం నడవగలనో

తానే ఎరిగి యున్నాడు

అంతకంటే నన్ను అలసిపోనీయడు

లోకములోనికి వెళ్ళుమని / Lokamuloniki Vellumani

లోకములోనికి వెళ్ళుమని

సువార్తను ప్రకటించుమని

పరలోకమార్గము చూపుమని

యేసయ్య సెలవిచ్చెను

1. కోతెంతో ఎక్కువని

పనివారు అతి తక్కువని

తన పొలములో పనిచేయుమని యేసయ్య సెలవిచ్చెను ॥లోక॥

చిన్న చిన్న పక్షులు చింతలన్ని వదలి / Chinna Chinna Pakshulu

చిన్న చిన్న పక్షులు చింతలన్ని వదలి

చిత్రమైన పాటలేవొ పాడుచున్నవి

దేవునిపై నమ్మికతో ముందుకే కదలి

దూర దూరతీరాలకు సాగుచున్నవి.

1 వాటికంటె మనలను శ్రేష్టులుగ చేసెను

నిట్టూర్పులు మాని సంతసించుదాం

మరణ భయము నుండి విడుదల

నిచ్చెను విశ్వాసంతో యాత్ర

సాగించుదాం

చిన్నారి నా జీవితం / Chinnari Naa Jeevitham

చిన్నారి నా జీవితం

యేసయ్య బహుమానం

నా నోటి ప్రతిగీతం

యేసయ్య నామ గానం

1. నా ప్రతి విషయములో

ఆయనకే ప్రధమ స్థానం

నా పరలోక తండ్రికి

నేనంటే ఎంతో ప్రాణం   ॥చిన్నా॥

నీవు చూచుచున్న ప్రతివాటి విషయం / Neevu Chuchuchunna Prathivaati Vishayam

1. నీవు చూచుచున్న

ప్రతివాటి విషయం

లెక్క అప్పగించవలెను ఒక దినం

నీ ప్రవర్తన అంతటియందు

ఎంతో జాగ్రత్త కలిగియుండు

2. నీవు వినుచున్న

ప్రతివాటి విషయం

లెక్క అప్పగించవలెను ఒక దినం

నీ ప్రవర్తన అంతటియందు

ఎంతో జాగ్రత్త కలిగియుండు

3. నీవు చేయుచున్న

ప్రతివాటి విషయం

లెక్క అప్పగించవలెను ఒక దినం

నీ ప్రవర్తన అంతటియందు

ఎంతో జాగ్రత్త కలిగియుండు

ఓ చిన్ని పుష్పమా / O Chinni Pushpama

1. ఓ చిన్ని పుష్పమా

నీ సంతోషమునకు

కారణమేమొ చెప్పుమా

నన్ను చేసినవాడు

అందం ఇచ్చినవాడు

నాకు ఏమి కావాలో

ఆయనే చూసుకుంటాడు

రేపటిని గూర్చి

నాకు దిగులు లేదుగా

సృష్టికర్తను స్తుతించుటయే

నా పనిగా

2. ఓ లేత హృదయమా

నీవు విచారపడుట

తగదని తెలిసికొనుమా

నిన్ను చేసినవాడు

ఎన్నడూ మరువడు

మాట తప్పనివాడు

నీ చేయి విడువడు

పువ్వులను చూసి

నేర్చుకొనుమా

చింత యేసుపై వేసి

సంతోషించుమా