ఆనందించుదాం అన్నివేళలందు
బలమొందుదాం యేసుక్రీస్తునందు
1. కష్టాలొచ్చినా కలత చెందము
నష్టాలొచ్చినా దిగులు చెందము
ఇమ్మానుయేలు దేవుడున్నాడు.
ఎల్లప్పుడూ మనతో ఉంటాడు
2. చిక్కులన్నీ యేసుకే అప్పగించడం
చింతలన్నీ ఆయనపైనే వేసెదం
ఇమ్మానుయేలు దేవుడున్నాడు.
ఎల్లప్పుడూ మనతో ఉంటాడు
చిన్నదియైనా నీకున్న దానిని
దేవునికి అర్పించుము
అ.ప: దేవునికి అర్పించుము
దేవుని నుండి పొందుము
1. ఐదు రొట్టెలు చిన్న చేపలే
చిన్నవాడు దేవుని కిచ్చాడు.
గొప్ప దేవుడు వేలమందికి
వాటితోనే ఆకలి తీర్చాడు ॥దేవు॥
2. లేక లేక పుట్టిన సుతుని
అబ్రాహాము దేవునికిచ్చాడు.
విస్తారమైన జనులకు
తండ్రిగా అతనిని చేశాడు ॥దేవు॥
1. ఓ మేఘమా నీకు వర్షించుట
ఎవరు నేర్పారమ్మా
భూమి ఆకాశము చేసినవాడు.
భూమి మీద సమస్తం ఉంచినవాడు
వర్షించుట నాకు నేర్పించాడు
భూమిని తడుపుటకు నన్నుంచాడు.
2. వసంతమా నీలో అందాలన్నీ
ఎవరు కూర్చారమ్మా
సృష్టికర్తయైన యెహోవా దేవుడు
సృష్టియంతటిని కలిగించినవాడు 2
నన్నింత అందంగా తీర్చిదిద్దాడు
ఆహ్లాదం పంచంగ సొగసులద్దాడు
ఇద్దరు ముగ్గురు కూడినచోట
ఉంటానన్నాడు దేవుడు
విశ్వాసముతో అడిగినవన్నీ
ఇస్తానన్నాడు యేసుడు
1. ఆయన రాజ్యమును
నీతిని వెదకిన
ఇష్టమైనవన్నీ అనుగ్రహిస్తాడు.
2. ఆవగింజయంత నమ్మకం ఉంచిన
మహా కొండలైన పెరికి వేస్తాడు.
తొందరపడకే చిన్ని హృదయమా
ధైర్యము వీడక నిలిచియుండుమా
1. నీకు కలుగు కష్టములో
దేవునితోడు ఉండునులే
మహిమ గలిగిన క్రీస్తే
నిన్ను చిటికెలో విడిపించునులే
2. చిక్కు తెచ్చు సమస్యలలో
దేవుడు నీ వెంటుండునులే
జ్ఞానియైన యేసే నీకు
జవాబును చూపించునులే
నశించు వారికి సువార్త చాటను
లోకమునకు వెళ్ళలేవా
దేవుని పిల్లలము
నీ పొరుగు వారికి యేసుని చూపను
మిషనరీవి కాలేవా
1. విలియం కేరీ ద్వారా
బైబిలు అనువాదమాయెను
ఐడాస్కడ్డర్ వల్ల
గొప్ప వైద్యాలయం వెలసెను
నీవల్ల దేవునికి రావాలి మహిమ
దేవుని పని చేయుమా ॥నశిం॥
2. భక్తి సింగ్ ప్రయాసతో
సంఘాలను స్థాపించెను
పండిత రమాబాయి
స్త్రీల విముక్తికై పాటుపడెను
నీవును చెయ్యాలి దేవుని సేవ
చూపాలి దైవప్రేమ
ఎవరున్నారు నాకోసం
సంపాదించగా ఈ దేశం
అడుగుచున్నది తండ్రి స్వరం
స్వీకరించవా ఈ భారం ॥ఎవ॥
1. అడుగుపెట్టగ ప్రతీస్థలం
తలుపుతట్టగ ప్రతీ గృహం
పరుగులెత్తగ ప్రతీదినం
పంచిపెట్టగ ప్రభువాక్యం ॥ఎవ॥
2. ప్రార్ధన చేయగ నిరంతరం
నశియించే ఆత్మలకోసం
చూపించగ రక్షణ ద్వారం
చాటించగ దేవుని రాజ్యం ॥ఎవ॥
దీవించే దేవుడు సమృద్ధినీయగా
కృతజ్ఞత కలిగి
ఆయనకొరకీయవా
1. తెలివి తేటలైనా నీ బలము సంపదైనా
దేవుని బహుమానమే గదా
తండ్రి ఆశీర్వాదమేగదా
2. రెండు కాసులైనా అది చిన్న
కానుకైనా దేవునికి ఎంతో ఇష్టం
నీ అర్పణ ఎంతో శ్రేష్టం
ఎంత ప్రేమ నాపైన నీకు యేసయ్యా
ఇంత ఇంతని కొలవడానికి వీలుకాదయ్యా
1. నన్ను పిలిచి ముద్దుపెట్టిఎత్తుకున్నావు
మంచి మంచి మాటలు చెప్పి
హత్తుకున్నావు నీలాంటి దేవుడెవరు
2. నీ కుమారునిగా నన్ను చేసుకున్నావు
జీవగ్రంథంలో పేరు రాసుకున్నావు.
నీలాంటి దేవుడెవరు