కోడి కూయు వేళ పరుగులెత్తెదం / Kodi kooyu Vela Parugulethedam

కోడి కూయు వేళ పరుగులెత్తెదం

బైబిల్‌ చేత పట్టుకొని సండేస్కూలుకు

జుం ల లా జుం ల లా

1. కమ్మనైన మాటలు ఎన్నో ఉంటాయి

తియ్యనైన పాటలు ఎన్నెన్నో వస్తాయి

అక్కా అన్నా తమ్ముడు చెల్లి

మనం కలసిపోదమా

యేసుని చెంతకు

మనం కలసిపోదమా

2. కొత్త కొత్త కధలు ఎన్నో చెబుతారు

బైబిలు వాక్యములు మరెన్నో నేర్పిస్తారు

అక్కా అన్నా తమ్ముడు చెల్లి

మనం కలసిపోదమా

యేసుని చెంతకు

మనం కలసిపోదమా

యేసయ్య నాలో ఉంటే / Yesayya Naalo Unte

యేసయ్య నాలో ఉంటే

ఎంతో ఆనందం

యేసయ్య నా వెంటుంటే

ఎంతో సంతోషం

ఆనందం ఆనందం

మనసంతా ఆనందం

సంతోషం సంతోషం

జీవితమంతా సంతోషం

1. యేసయ్య మాటంటే చాలు

ఎంతో ఉల్లాసం

యేసయ్య నాలో ఉంటే

ఎంతో ఉత్సాహం

ఉల్లాసం ఉల్లాసం ఉప్పొంగిన ఉల్లాసం

ఉత్సాహం ఉత్సాహం

ఎదనిండా ఉత్సాహం

పిల్లలం యేసు బిడ్డలం / Pillalam Yesu Biddalam

పిల్లలం యేసు బిడ్డలం

పిల్లలం యేసు శిష్యులం

1 మా ఆట మా పాట మా దేహమంతా

మా శక్తి మా యుక్తి మా బలమంతా

యేసు నీకే జీసస్‌ యు ఆర్‌ మై గాడ్‌

2. మా మాట మా నడక

మా తలంపంతా మా ధనము

మా ఘనము మా సర్వమంతా

యేసు నీకే జీసస్‌ యు ఆర్‌ మై గాడ్‌

చిన్న పిల్లలారా / Chinna Pillalaara

చిన్న పిల్లలారా

చివరి సమయమిదేరా

యేసు వచ్చు వేళరా

ఎదురు చుద్దాంరా

1. యేసయ్యను నమ్మండి

యేసయ్యలో ఉండండి

యేసులోనే ఎదగండి

యేసుతోనే నడవండి

2. గురుతులెన్నో చెప్పాడు

షరతులెన్నో ఇచ్చాడు

మరువద్దని అన్నాడు

మన యేసు దేవుడు

3. క్రీస్తువలె ఉంటాడు

క్రీస్తు విరోధి వస్తాడు

క్రీస్తులానే చేస్తాడు

క్రీస్తు అతడు కాడు

చికు చికు బండి రైలు బండి / Chiku Chiku Bandi Railu Bandi

చికు చికు బండి రైలు బండి

చక చక పోతుంది

ఆలస్యం చేయకుండ

గబ గబ ఎక్కండి

అక్కడ ఇక్కడ ఎక్కడాఇక ఆగబోదండి నేరుగా

పరలోకానికే చేరుతుందండి

1. రెడ్‌ సిగ్నలు లేదండి

యాక్సిడెంట్లు కావండి

యేసయ్యే డ్రైవరు

భయమేమి మనకు లేదండి                           ॥చికు॥

2. అన్నా తమ్ముడు అక్కా చెల్లి

రక్షణ పొంది రారండి

యేసయ్యతో పయనించే

ఛాన్స్ నే పట్టేయండి                                       ॥చికు॥

ఆదాము హవ్వ హో హో హో / Aadamu Havva Ho Ho Ho

ఆదాము హవ్వ హో హో హో

బ్యూటిఫుల్‌ తోటలో హో హో హో

అనుదినం జాలిగా గడిపినారు.

1. కలర్ఫుల్‌ పండు చూసి

హో హో హో

వండర్పుల్‌ దేవుని మరచి

హో హో హో

కలర్ఫుల్‌ పండు తీసి

వండర్పుల్‌ దేవుని మరచి

తిన్నారు అయ్యో తిన్నారు.

2. సినఫ్ఫుల్‌ ఫ్యామిలి అయినారు

పీస్ పుల్‌ ఏదెను పొగొట్టుకొన్నారు.

చెల్లెలారా మాట వినుట ఎంతో శ్రేష్ఠము

తమ్ముడా లోబడుట దేవుని కిష్టము

జయించువానికి దేవుని పరదైసులో

జీవవృక్షఫలము భుజింపనిత్తును

హో హో హో హో హో హో

బుడి బుడి అడుగులు వేస్తు / Budi Budi Adugulu Vesthu

బుడి బుడి అడుగులు వేస్తు

యేసుతో నడిచెదను

సండేస్కూల్కి వెళ్తూ

యేసుని స్తుతించెదను

షాలోమ్‌ చెప్పుచు అందరికి

షేక్యండ్‌ ఇచ్చెదను

సంతోషముగా నా యేసుతో

సండే గడిపెదను

చిన్ని కల్వరి సైనికులం

యేసు రాజ్యపు వారసులం                           ॥బుడి॥

1. చిన్నప్రాయంలో

యేసుని వెంబడిరచుచు

నా సిలువను ఎత్తుకొని

గురి యొద్దకే సాగెదా

షాలోమ్‌ చెప్పుచు అందరికి

షేక్యాండ్‌ ఇచ్చెదను

సంతోషముగా నా యేసుతో

సండే గడిపెదను

చిన్ని కల్వరి సైనికులం

యేసు రాజ్యపు వారసులం                           ॥బుడి॥

కలలు కనే యోసేపు / Kalalu Kane Yosepu

కలలు కనే యోసేపు

వాట్‌ యే బ్యూటిఫుల్‌ డ్రీమ్స్‌ నీకు

చిత్రమైన నిలువుటంగీ

వాట్‌ యే కలర్ఫుల్‌ డ్రస్సు నీకు

వాట్‌ యే వాట్‌ యే వాట్‌ యే

వాట్‌ యే బ్యూటిఫుల్‌ డ్రీమ్స్‌ నీకు

వాట్‌ యే వాట్‌ యే వాట్‌ యే

వాట్‌ యే కలర్ఫుల్‌ డ్రస్సు నీకు

1. ఫరోకు కల వచ్చి

కలవరము పొందెను

యోసేపు కల భావం చెప్పి

ప్రధాని ఆయెను

వాట్‌ యే వాట్‌ యే వాట్‌ యే

వాట్‌ యే సూపర్‌ వరము నీకు

యేసుతో నడచి వెళ్ళెదం / Yesutho Nadachi Velledam

యేసుతో నడచి వెళ్ళెదం

అన్ని తావులలో

యేసుతో కూడ నుండెదం

అన్ని వేళలలో

1. రూపాంతర కొండనెక్కెదం

యేసుప్రభుని మహిమ చూచెదం

తండ్రి స్వరము చెవినబెట్టిదం

ఆనందం అనుభవించెదం

2. కల్వరిగిరి పైకి వెళ్ళేదం

యేసుని అనుసరించి సాగెదం

సిలువ శ్రమలో పాలుపొందెదం

భయపడక నిలిచియుండెదం

ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది / Aakaashamlo kotha Chukka Puttindi

ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది

వింత వింత కాంతులు పంచిపెట్టింది.

1. ప్రజలందరికీ మంచి వార్త తెచ్చింది

లోకరక్షకుని జన్మ చాటి చెప్పింది

2. జ్ఞానులకు సరియైన దారి చూపింది

బాలుడైన యేసురాజు చెంత చేర్చింది.