క్రీస్తుయోధులం క్రీస్తుయోధులం
సిలువ జెండ ఎత్తి సాగెదం
1. సాతాను ఎదురించినా
లోకాశలు ఆకర్షించినా
విశ్వాస కర్త యేసు వైపే
చూచుచు సాగి వెళ్ళెదం ॥కీస్తు॥
2. మంచి పోరాటం పోరాడెదమ్
మా పరుగు కడముట్టించెదం
విశ్వాసమును కాపాడుకొందుము
జీవకిరీటం పొందెదం ॥క్రీస్తు॥
యేసుకు నేను సాక్షిగా
బ్రతికెద నా జీవితములో
పౌలును పోలి నడిచెదను
క్రీస్తువలె నే జీవించెదన్
1. కష్టములో నష్టములో
శ్రమలందు బాధలందు
నను విడిపించి రక్షించును
నమ్మదగిన స్నేహితుడు ॥యేసు॥
2. శోధనలో చిక్కులలో
వ్యాధులలో ఇరుకులలో
నను రక్షించి కాపాడును
నమ్మదగిన స్నేహితుడు ॥యేసు॥
చిన్న గొర్రెపిల్ల నేను యేసయ్య
మెల్ల మెల్లగా నడుపు యేసయ్య
యేసయ్య నా యేసయ్య
శాంతకరమైన జలముల యొద్దకు
నన్ను నడిపించు నా యేసయ్య
పచ్చిక బయళ్ళు చోటులకు
నన్ను నడిపించు నా యేసయ్య
2. అంధకార లోయలో నేనుండగా.
నీదు హస్తం నన్ను నడిపించును
ఆశ నాకు ఒక్కటి ఉన్నదయా
చక్కనైన నీదు యిల్లు నేను చేరగా
నీ రెక్కల క్రింద నేను దాగెదన్
నాకు సహాయము నీవెగా నీవెగా
హోసన్నా హల్లెలూయ
హల్లెలూయ హోసన్నా
1. దిన దినము నా మార్గములో
క్షణ క్షణము నా ప్రవర్తనలో
నాకు సహాయము చేయుము (2)
చేయుము
2. నా చూపులలో నా వినికిడిలో
నా మాటలలో నా తలంపులలో
నాకు సహాయము చేయుము (2)
చేయుము ॥హోస॥
చాక్లెట్ కంటే స్వీటి
బొమ్మల కంటే బ్యూటి
దేవుని పిల్లల భేటి
మన ఆదివారపు బడి
1. అమ్మ వండిన పాల బువ్వ
ఎంతో ఎంతో రుచి (2)
కమ్మనైన క్రీస్తు మాటలు
ఇంకా ఇంకా రుచి
మాకు ఇంకా ఇంకా రుచి
2. స్కూల్లో టీచర్ చెప్పిన పాఠం
మాకు ఎంతో ఇష్టం (2)
గుళ్ళో అన్నలు నేర్పిన కధలు
ఇంకా ఇంకా ఇష్టం
మాకు ఇంకా ఇంకా ఇష్టం.
3. పాటలు పాడి వాక్యం చదివి
భక్తులమైపోదాము (2).
పెందలకడనే సండేస్కూల్కు
అందరమెళ్ళిపోదాము మనము అందరమెళ్ళిపోదాము
యేసుక్రీస్తు మహిమలివె వినరే
యేసుక్రీస్తు మహిమలివె కనరే
జుం జుజుం జుం (4)
1. కానాలో నీళ్ళను రసముగ జేసె
ఐదురొట్టె రెండు చేప వేలకు పంచె
2. కుంటి గ్రుడ్డి రోగులకు స్వస్థత జేసె
చనిపోయిన వారిని బ్రతుకగ జేసె
3. పాపులందరి కొరకు ప్రాణము బెట్టె
మూడవ దినమున మహిమతో లేచె
రావే రావే చెల్లి వేవేగి పోదామా
బేత్లహేము పోయి
యేసయ్యను చూద్దామా
1. పుసి పుసి పిల్లి
నీవు మాతో వస్తావా
2. మే మే మేక
నీవు మాతో వస్తావా
3. అంబ అంబ ఆవు
నువ్వు రంకె వేస్తావా
ఆరాధించెదన్ స్తుతియించెదన్
పూజించెదన్ నా యేసుని
1. నా చిన్ని మనసుతో ఆరాధించెదన్
నా చిన్ని ఆత్మతో ఆరాధించెదన్
నా చిన్ని హృదయముతో
ఆరాధించెదన్ నాకున్న శక్తితో
ఆరాధించెదన్ ॥ఆరా॥
దేవుడే దావీదు దుర్గము
ధైర్యమే దావీదు బలము
ఆపద ఏదైనా శత్రువు ఎవరైనా
దేవుని శక్తితో గెలిచెను
ఓ.. ఓ… ఓ… ఓ… ఓహోహో (4)
1. సింహమొచ్చెను తోక ముడిచెను
ఎలుగుబంటి పరుగు తీసెను
గొల్యాతు వచ్చెను విర్రవీగెను
దావీదు చేతిలో చచ్చెన ॥ఓ॥
2. దేవుని ఆజ్ఞకు లోబడెను
దేవునికిష్టునిగా బ్రతికెను
దేవుడు మెచ్చెను ఆశీర్వదించెను
దావీదు రాజుగా చేసెను ॥ఓ॥