ధింతకుం ధింతకుం ధింతకుం /Dinthakum Dinthakum

ధింతకుం ధింతకుం ధింతకుం

తయ్యారే (2)

ఏటిలోన గులకరాళ్ళు ఐదు ఏరెను

ధింతకుం ధింతకుం ధింతకుం

తయ్యారే

వడిసెలో ఒకటి పెట్టి

త్వరగా తిప్పను

ధింతకుం ధింతకుం ధింతకుం

తయ్యారే

స్పీడు పెంచెను

సూపర్‌ స్పీడు పెంచెను

యెహోవాదే యుద్ధమంటూ

రాయి విసిరెను

శత్రువైన గొల్యాతు కుప్పకూలెను

ధింతకుం ధింతకుం ధింతకుం

తయ్యారే (2)

చుక్‌ చుక్‌ బండి రైలు బండి / Chuk Chuk Bandi Railu Bandi

చుక్‌ చుక్‌ బండి రైలు బండి

చుక్‌ చుక్‌ బండి మోక్షం బండి

చుక్‌ చుక్‌ బండి సువార్త బండి

ఎవ్వరు పోగలరు?

చుక్‌ చుక్‌ బండి రైలు బండి

చుక్‌ చుక్‌ బండి స్వనీతి బండి

చుక్‌ చుక్‌ బండి అపాయ బండి

అది నీ బండియా?

1. బండి డ్రైవరు సాతానుడైన

వంకర త్రోవలో నడిపించున్‌

పాపపు బురదలో దించేసి

త్రోయును నరకములో(2) ॥చుక్‌॥

2. బండి డ్రైవరు యేసుడైన

తిన్నని దారిలో నడిపించున్‌

కనుపాపవలె కాపాడును

ఈ విధి నిశ్చయము (2) ॥చుక్‌॥

డిoగ్‌ డిoగ్‌ డిoగ్‌ ఎద్దుల బండి / Ding Ding Yeddula Bandi

డిoగ్‌ డిoగ్‌ డిoగ్‌ ఎద్దుల బండి

క్లింగ్‌ క్లింగ్‌ క్లింగ్‌ సైకిలు బండి

పోం పోం పోం మోటరు బండి

హల్లెలూయ హల్లెలూయ

రక్షణ బండి

ఏ బండి కావాలి బాలలు

ఏ బండి ఎక్కాలి బాలికలు

యేసయ్యే మార్గము.

యేసయ్యే సత్యము

యేసయ్యే నడుపును జీవపు బండి

నోవహు ఓడ త్వరగా చేయుము / Noahhu Voda Thwaraga Cheyumu

నోవహు ఓడ త్వరగా చేయుము

మహావర్షం కురియును త్వరలో

లోబడెను ఆ భక్తుడు

కట్టెను ఓడను స్వయముగా (2)

కట్టెను ఓడను టక్‌ టక్‌

జోరున కురిసెను మహ వర్షం

వరదలు పొంగెను పైపైకి

కేకలు వేసెను జనులెల్ల

నోవా నోవా తలుపుతియ్‌

దేవుడే ఓడ తలుపు బిగించెను

నశించిరి లోబడని ప్రజలు

రక్షణ ఓడ క్రీస్తు యేసే

తడవు చేయక రండి రండి

పిలుచుచున్నాడు అందరిని

రక్షణ ఓడ లోపలికి

యేసుని ప్రేమ బహు కమ్మనైనది / Yesuni Prema Bahu Kammanainadi

యేసుని ప్రేమ బహు కమ్మనైనది.

జీవాహారం మధురాతి మధురమే

భలే భలేగుందిలే

తేనే కంటే తియ్యగా ॥యేసు॥

1. ఐదు రొట్టెలు రెండు చేపలు

ఐదు వేలు తిన్నారు.

ఆహా ఓహో అన్నారు (2) ॥భలే॥

2. కానా పెళ్ళిలో నీళ్ళను మార్చాడు.

ద్రాక్షా రసమును త్రాగి

ఆహా ఓహో అన్నారు (2) ॥భలే॥

ఎవ్వరు చేసిరి చుక్కలను చుక్కలను / Evvaru Chesiri Chukkalanu

1. ఎవ్వరు చేసిరి చుక్కలను చుక్కలను

చుక్కలను పరలోకపు దేవుండు

2. ఎవ్వరు చేసిరి పువ్వులను

పువ్వులను పరలోకపు దేవుండే

3. ఎవ్వరు చేసిరి పక్షులను

పక్షులను పరలోకపు దేవుండే

4. ఎవ్వరు చేసిరి నిన్ను నన్ను నిన్ను

నన్ను పరలోకపు దేవుండు

బలె బలె మాట బంగారు మాట / Bale Bale Maata Bangaru Maata

బలె బలె మాట బంగారు మాట

బైబిల్లో మాట యేసు మాట

నా జీవితాన నీ జీవితాన

మరువని మాట యేసు మాట

1. దీర్ఘశాంతము గలవారమై

కీడుకు కీడు చేయకను

మేలైనదానిని చేపట్టుచు

ప్రార్ధన జీవితము జీవించుడి

ప్రతి విషయమందు

కృతజ్ఞత స్తుతులు

చెల్లించుచునే సాగుడి

స్తోత్రము స్తోత్రము స్తోత్రము / Srothramu Srothramu Srothramu

స్తోత్రము స్తోత్రము ప్రోత్రము

మహిమ ఘనత ప్రభావము

యేసు రాజుకే చెల్లును

ఆయనకే చెల్లింతును

1. భూమి ఆకసం

సముద్రము జలములు

పొలములు పైరులు

వన వృక్షములు

ఆయన మహిమను వివరించును

ఆయన సన్నిధిని సంతసించును

2. సూర్యచంద్రులు ఆకాశ పక్షులు

అడవి జంతువులు జలచరాదులు.

ఆయన మహిమను వివరించును ఆయన సన్నిధిని సంతసించును

సాగిపోవుచున్నది దీర్ఘయాత్ర / Saagipovuchunnadi Deergha yaatra

సాగిపోవుచున్నది దీర్ఘయాత్ర

కనానులోనికి ఆ మంచి భూమికి

అ.ప: ముందుకే పయనము

వెనుకకు తిరిగి చూడము

యెహోవా తోడుండ

భయము లేదుగా

1. ఆకలైన వేళలో

మన్నా కురిపించును

దాహమైన వేళలో

బండ పొర్లి పారును    ॥ముందు॥

2. అడ్డగించు సంద్రము

పాయలుగా చీలును

తరిమికొట్టు సైన్యము

నాశనమై పోవును                           ॥ముందు॥

జీవముగలవాడు నా దేవుడు / Jeevamugala Vaadu Naa Devudu

జీవముగలవాడు నా దేవుడు

జీవించుచున్నవాడు

1. గుడ్డివాడు కాడు నా దేవుడు

నా క్రియలన్‌ చూచును

చెవిటివాడు కాడు నా దేవుడు

నా మొర వినుచుండును ॥జీవ॥

2. మూగవాడుకాడు నా దేవుడు

నాతో మాట్లాడును

కురుచకాదు మరి ఆయన హస్తము

నన్నిల రక్షించు

3. మనుషులు చేసిన

వట్టి విగ్రహం కాదు నా దేవుడు

ఆత్మ రూపిగ మాతో నుండి

మమ్మును కాపాడును