రారండి చిన్న పిల్లలారా / Rarandi Chinna Pillalaara

రారండి చిన్న పిల్లలారా

మన ప్రియ యేసుతో మాట్లాడను

కలసి రండీ (2)

మన ప్రియ యేసుతో మాట్లాడను

1. ప్రేమతో యేసు పిలచుచుండే

వాద్యములతో పాడుచు వెళ్ళెదం

2. బైబిలు యేసునకు ప్రియము

బాగుగా దానిని వినెదము

3. అన్న వస్త్రములను మాత పిత

సోదరి సోదరులనిచ్చెన్‌

4. ప్రియ యేసు తెచ్చెను మన కొరకై

చూడుము ఎన్నో దీవెనలు

అరిచే నెమలికి తెలుసా / Ariche Nemaliki Thelusaa

1. అరిచే నెమలికి తెలుసా

ఎగిరే లేడికి తెలుసా

ఆ అందం యేసు ఇచ్చిందేనని

2. కూసే పక్షికి తెలుసా

రాసే కవితకు తెలుసా

ఆ మధురిమ యేసు ఇచ్చిందేనని

3. పూసే పువ్వుకు తెలుసా

తడిసిన మట్టికి తెలుసా

ఆ పరిమళం యేసు ఇచ్చిందేనని

4. అందం కంటే గొప్పది

మకరందం కంటే గొప్పది

సువాసన కంటే గొప్పది

యేసు ఇచ్చే రక్షణ

స్వీకరిస్తావా ఆస్వాదిస్తావా

కలుగదు రక్షణ ఏ నామములో / Kalugadu Rakshana Yee Namamulo

కలుగదు రక్షణ ఏ నామములో

కలుగును క్షమాపణ యేసు

నామములో

1. యేసు అంటే రక్షకుడు

తెలుసుకో తెలుసుకో

క్రీస్తు అంటే అభిషిక్తుడు

తలచుకో తలచుకో

ప్రభు యేసుని నమ్ముకో

హృదయములో చేర్చుకో

ప్రతిదీవెన అందుకో

పరలోకం పొందుకో

2. భేదమేమి లేదు అందరు

పాపులు పాపులు

వాదమేమి లేదు

యేసే దేవుడు దేవుడు

గాయాలు పొంది.

రక్తమంత కార్చెను ప్రతి పాపిని కడిగి పవిత్రపరచెను

నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా /Nee Viswasa Naavalo Yesu unnadaa

నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా

ఆయన కూర్చోన్న నావలో

నీవు వున్నావా

తెలుసుకొనుము ఓ మనసా

తెలుసుకొనుము (2)

ఇదే అనుకూల సమయము

యేసు ద్వారా

1. పాప లోకంలో! పాప లోకంలో

యేసు తప్ప దేవుడున్నాడా

పాపాలు క్షమియించే

నాధుడున్నాడు.

తెలుసుకొనుము ఓ మనసా

తెలుసుకొనుము (2)

మన పాపాలు పోవును యేసు ద్వారా

మన శాపాలు పోవును యేసు ద్వారా

2. ఆహ పరలోకం ఓహో పరలోకం

మనకు ఇచ్చే యేసు ఉండగా

పాపాన్ని విడిచిపెట్టు యేసు ముందర

తెలుసుకొనుము ఓ మనసా

తెలుసుకొనుము (2)

పరలోకానికి మార్గము యేసు

బానిసవు కాదు బందీవి కాదు / Baanisavu kaadu Bandivi Kaadu

బానిసవు కాదు బందీవి కాదు.

సాతాను చేతి నుండి

విడుదల దొరికెను

స్వేచ్ఛను ప్రభు నీకిచ్చెను

ఎగురగురు పైపైకెగురు

పక్షిరాజు వలె రెక్కలు చాచి ఎగురు

1. మేఘమొచ్చిన ఉరుమొచ్చిన

కారుమబ్బులే కమ్ముకొచ్చిన

ఆపలేవులే ప్రభు బలముండగా

ముద్దులొలికే చిన్ని నోటితో / Muddu Lolike Chinni Notitho

ముద్దులొలికే చిన్ని నోటితో

మృదువైన పెదవులతో

అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పాలి.

1. అబద్ధమాడిన గేహజి

కుష్ఠ రోగి అయినాడు

అననీయ సప్పిరా చచ్చిపోయారు.

అబద్ధాలు నేర్పే వాడు.

మన విరోధి సాతానే

అబద్దమాడిన వారు

అగ్నిగుండములో పడతారు                 ॥ముద్దు॥

2. సత్యమంటే యేసయ్యే

సత్యసాక్షి అయ్యాడు

సత్యమునే చెప్పాడు

సిలువపై మరణించాడు.

ప్రాణం పోతున్నాగాని నిజమే చెప్పాలి.

దేవుని మెప్పును కోరాలి

జీవకిరీటం పొందాలి               ॥ముద్దు॥

బాలలు మరి బాలికలు / Baalalu maree Baalikalu

బాలలు మరి బాలికలు

ప్రభువు పనికై నడవాలి

బాలలు మరి బాలికలు

ప్రభువు పనికై నిలవాలి

వెనుక వాటిని మరవాలి

సిలువ మోయుచు సాగాలి

యేసు చేయిపట్టి నడవాలి.

జీవమకుటం పొందాలి ॥బాల॥

1. యేసే మార్గమని చాటాలి.

యేసే సత్యమని చెప్పాలి

యేసే జీవమని పాడాలి

మహిమలోనే చేరాలి

యేసయ్య ప్రేమతో / Yesayya Prematho

యేసయ్య ప్రేమతో

హృదయమంతా నిండెను

నా పాపమంతా కడిగి నన్నె మార్చెను

ల ల ల ల్లా లా లా లా లా ల ల

చెడు చూపులను చెడు మాటలను

చెడు క్రియలను చెడు స్నేహితులన్‌

యేసయ్య ప్రేమకై విడిచిపెట్టెదన్‌

యేసయ్య కృపలో నేను

ఎదుగుచుండెదన్‌

2. విశ్వాసముతో ప్రార్ధనలో

వాక్యముతో సహవాసములో

దిన దినము యేసులో

ఎదుగుచుండెదన్‌

యేసయ్య రాకకై ఎదురు చూచెదన్‌

హోసన్న హోసన్న / Hosanna Hosanna

హోసన్న హోసన్న

హోసన్న మహోన్నతుడు హల్లెలూయ

దేవ నీ నామము ఉన్నత నామము

కృతజ్ఞతా స్తుతులు నీకే

ప్రభావము రారాజుకే

కీర్తి కీర్తి కీర్తి రారాజుకే హల్లెలూయ

దేవ నీ నామము ఉన్నత నామము

కృతజ్ఞతా స్తుతులు నీకే

ప్రభావము రారాజుకే

శక్తి గల దేవుడు మన యేసయ్య / Shakthi Gala Devudu Mana Yesayya

శక్తి గల దేవుడు మన యేసయ్య

అద్భుతాలు చేసే దేవుడు

మన యేసయ్య విన్నావా కన్నావా

నీవెపుడైనా చూశావా

1 ఎఱ్ఱ సంద్రాన్ని పాయలుగా చేశాడు.

ఆరిన నేలను తన ప్రజలను నడిపాడు.

2 నాల్గు రోజులైన సమాధిని తెరిచాడు

చచ్చిన లాజరును తిరిగి లేవమన్నాడు

3 ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి ఆహారంగా ఇచ్చాడు