మేడి చెట్టు పైకి ఎవ్వరెక్కారు?
మేడి చెట్టు పైకి ఎందుకెక్కారు?
మేడి చెట్టు పైకి జక్కయ్య ఎక్కాడు.
యేసు ఎవరో చూడాలని చెట్టుఎక్కాడు.
1. మేడి చెట్టు కింద ఎవ్వరాగారు?
చెట్టు దిగిన జక్కయ్య ఏమి చేసాడు?
మేడి చెట్టు క్రింద రక్షకుడాగాడు
యేసును జక్కయ్య ఇంట చేర్చుకున్నాడు.
2. ఓ… ఓ తమ్ముడా ఓ… ఓ చెల్లెలా
యేసుని నీవు చేర్చుకుంటావా
నీ హృదయములో స్థానమిస్తావా
ఓ… ఓ తమ్ముడా ఓ… ఓ చెల్లెలా
పఠింప శ్రేష్ఠ గ్రంధము బైబిల్
పఠింప శ్రేష్ఠ గ్రంధము బైబిల్
అనుదినం పఠించిన
ప్రేమ తోడ నడుపును
ఓ పఠింప శ్రేష్ఠ గ్రంధము బైబిల్
బలము లేని చిట్టి చీమలు
లెఫ్ట్ రైట్ లెఫ్ట్
బుద్ధి గలిగి నడుచుకొనెను
వావ్ వావ్ వావ్
నాయకుడెవరు లేకున్నను
లెఫ్ట్ రైట్ లెఫ్ట్
జ్ఞానముతో జీవించెను
వావ్ వావ్ వావ్
క్యూ కట్టి పనికి నడుం కట్టి
ఆహరం నెత్తిని బెట్టి కూడ బెట్టెను
వేసవి కాలం కోత కాలం
కూర్చుకొనెనుజి
శీతాకాలం కష్టకాలం
హాయిగా బ్రతికెను
చకాం చకాం చకాం
చకాం చకాం చకాం
2. గుర్రు పెట్టి నిదుర పోయే
సోమరి మేలుకో
చీమల యొద్దకెళ్ళి బ్రతుకుట నేర్చుకో
క్యూ కట్టి పనికి నడుం కట్టి
ఆహరం నెత్తిని బెట్టి కూడ బెట్టెను (2)
వేసవి కాలం కోత కాలం
కూర్చుకొనెనుజి
శీతాకాలం కష్టకాలం
హాయిగా బ్రతికెను
చకాం చకాం చకాం
చకాం చకాం చకాం
చిన్న చిన్న జీవులు చిన్నారి జీవులు
చిట్టిపొట్టి కాళ్ళు చిన్న చిన్న రెక్కలు
అక్కడ ఇక్కడ మరెక్కడైన ఉండును
1. చిన్నవని చిన్న చూపు చూడకు
లెస్సైన జ్ఞానము వాటికున్నది ॥చిన్న॥
2. చీమ అని తక్కువగా ఎంచకు
సోమరికి నేర్పును గొప్ప పాఠము ॥చిన్న॥
3. బల్లి అని హీనముగా చూడకు
పట్టుదల లేని వానికదే పాఠము ॥చిన్న॥
4. మిడత అని హీనముగా చూడకు
క్రమశిక్షణ లేని వాని క్రియా పాఠము ॥చిన్న॥
5. చిన్న కుందేలని ఛీత్కారము చూపకు
రక్షణకు చూపునది భలే మార్గము ॥చిన్న॥
యేసయ్యను నా దేవునిగా చేసుకున్నాను
నా హృదయం సమస్తం ఆయన కిచ్చాను
హల్లెలూయ యేసులో విజయం నాకే (4)
1. కుడి వైపు చూసినా
సాతాన్ ఓడిపోయెను
ఎడం వైపు చూసినా
సాతాన్ ఓడిపోయెను
వెనుదిరిగి చూసినా
సాతాన్ ఓడిపోయెను
ముందుకెళ్ళి చూసినా
సాతాన్ ఓడిపోయెను
సాతానా నీకు అపవాది నీకు
కొమ్ములే కాదు
తోక కూడ ఉందిలే
నీ బుద్ది నాకు తెలుసు
నీ కుట్రలు తెలుసు
నీతో చెలిమేలా
నీకు నాకు స్నేహమా
పో సాతానా పో.. పో.. పో..
దగ్గరకు రావద్దు పో
1. యేసే నా మిత్రుడు
యేసే నా రక్షకుడు
యేసే విమోచకుడు
నా ప్రభు యేసే
లాలలల లాల్ల లాల్ల లాల్ల (3)
ఏమి ఏమి ఇంత చిత్రమో
ఓ చిన్నారి
లోకమంతా ఎంత చిత్రమో
ఓ పొన్నారి
అ.ప.: అవునులే అనినంతనే
కలిగెలే లోకమింతగా
అంతయు మంచి మంచిగ
దేవుడే చేసెనింతగా
అంతయు వింతగా చేసెలే
మరి ఎంతయో వింతగా తోచెలే
1. వెలుగు కలిగె మొదటి రోజున ఓ చిన్నారి
నింగి గాలి రెండో రోజున ఓ పొన్నారి
నేల నీరు చెట్టు చేమలు ఓ చిన్నారి
ప్రభువు చేసే మూడో రోజున ఓ పొన్నారి
2. సూర్య చంద్ర తారలన్నియు ఓ చిన్నారి
ప్రభువు చేసే నాల్గో రోజున ఓ పొన్నారి
చేప పక్షి జాతులన్నియు ఓ చిన్నారి
ప్రభువు చేసే ఐదో రోజున ఓ పొన్నారి
3 మృగములు ఆదామవ్వలు ఓ చిన్నారి
ప్రభువు చేసే ఆరో రోజున ఓపొన్నారి
సృష్టినంత చూచి దేవుడు ఓ చిన్నారి
ఏడో రోజు విశ్రమించెనే ఓ పొన్నారి
అంతయు సృష్టి అంతయు
హాయిగా పూర్తియాయెనే
అందుకే ఆదివారము నిలిచెనే అ
పూజ దినముగా
అంతయు వింతగా తీరెలే మరి అ
ఎంతయో వింతగా తోచెలే
నా చిట్టి చేతులతో
చప్పట్లు కొట్టుచు
నా చిన్ని నోరితో
యేసయ్య పాట పాడెదన్
స్తోత్రం స్తుతి స్తోత్ర
అంటు చేతులెత్తి ఆరాధించెద .
ఆత్మతో సత్యముతో జరి
నేను ఆశ తీర ఆరాధించెద
1. సమూయేలువలె నే స్వరము వింటు
దానియేలువలె నే ప్రార్ధించెద
ఏలీయావలె యొర్దానుని విడగొట్టెద
పౌలు సీలవలె చెరసాల సంకెళ్ళు
తెంచి వేసెద
భలే భలే భలే భలే ప్రశ్న (4)
1. అద్దంలో నీ ముఖము స్పష్టంగా
కనిపించేదెప్పుడు (2)
కనులు బాగ కనిపిస్తు ఉంటే
ఆ అద్దము బాగుంటే (2)
2. వాక్యంలో నీ హృదయం స్పష్టంగా
కనిపించేదెప్పుడు (2)
అంతరంగ కనులు తెరవబడితే
నీవు ఆత్మకు ఆలయమైతే (2)