బలమైనది స్థిరమైనది దేవుని హస్తం
బాలలను దీవించిన దక్షిణ హస్తం
కొలత లేని కలత లేని ప్రభుని హస్తం
ముడత లేని మచ్చ లేని యేసుని హస్తం
మట్టిని మనిషిగా మలచిన హస్తం
దైవ రూపం పెట్టిన హస్తం
సూర్యచంద్ర సంద్రాలను ఆపిన హస్తం
సృష్టిక్రమం నిర్వహించే దేవునిహస్తం
బలమైనది స్థిరమైనది దేవుని హస్తం
బాలలను దీవించిన దక్షిణ హస్తం
కొలత లేని కలత లేని ప్రభుని హస్తం
ముడత లేని మచ్చ లేని యేసుని హస్తం
మట్టిని మనిషిగా మలచిన హస్తం
దైవ రూపం పెట్టిన హస్తం
సూర్యచంద్ర సంద్రాలను ఆపిన హస్తం
సృష్టిక్రమం నిర్వహించే దేవునిహస్తం
1. నీ ప్రేమ ఎంతో మాధుర్యము
నీ సృష్టి ఇల ఆశ్చర్యము
నీ త్యాగం వర్ణానాతీతము
నీ రక్షణ అతి గంభీరము
యేసయ్య నేను నీ వాడనే
నన్ను నీ సొత్తు చేశావుగా
ఏమిచ్చి నీ రుణం తీర్చెదను
నా స్తుతి నీకే అర్పింతును
2. నీ ప్రేమ ఎంతో మాధుర్యము
నీ సృష్టి ఇల ఆశ్చర్యము
నీ త్యాగం వర్ణానాతీతము
నీ రక్షణ అతి గంభీరము
యేసయ్య నేను నీ దాననే
నన్ను నీ సొత్తు చేశావుగా
ఏమిచ్చి నీ రుణం తీర్చెదను
నా స్తుతి నీకే అర్పింతును
అబెద్నగో షడ్రకు మేషకు
వచ్చి పడెనె పెద్ద చిక్కు
రాజు ప్రతిమకు మ్రొక్కమంటూ
సాతాను ప్లే చేసే ట్రిక్కు
1. ఏడంతల వేడిమి పెంచినా
అగ్నిలో మమ్మును కాల్చినా
నీ ప్రతిమంటే మాకు లేదు లెక్క
మ్రొక్కమంటూ చెప్పినారు ఎంచక్కా
అబెద్నగో షడ్రకు మేషకు
సాతానుకు పెట్టినారు చెక్కు
ఇసుక మీద ఇల్లు కట్టకు
అది కూలిపోతుంది (2)
వాన కురిసి వరద వస్తే
గాలి తోడై విసిరి కొడితే (2)
మాట వినని వాని ఇల్లు
కూలిపోయెను
లోబడని వాని
ఇల్లు కూలిపోయెను
వాని సొగసైన ఇల్లు కూలిపోయెను
1. బండ మీద ఇల్లు కట్టుకో
అది స్థిరముగా ఉంటుంది(2)
వాన కురిసి వరద వస్తే
గాలి తోడై విసిరి కొడితే (2)
మాట వినిని వాని ఇల్లు ధీటుగుండెను
లోబడిని వాని ఇల్లు మేటిగుండెను
వాని సొగసైన ఇల్లు నిలిచియుండెను
2. జోరు వాన హోరు గాలి వరదపోటు
ఆ ఇంట ముంగిట తెల్ల బోయెగ
బండ మీద ఇల్లు కట్టి
సాటి లేదని చాటి చెప్పి (2)
బండైన యేసు మీద నీ బ్రతుకు
ఇంటిని కట్టుకోవయ్యా
బండైన యేసు మీద నీ బ్రతుకు
ఇంటిని కట్టుకోవమ్మా
చావు వద్ద తీర్పు వద్ద
కూలి పోని కాలి పోని (2)
నిత్యం జీవం పొంద రావయ్యా
సజీవుడైన యేసు దేవుని స్వీకరించయ్యా
నిత్యం జీవం పొంద రావమ్మా సజీవుడైన యేసు దేవుని స్వీకరించమ్మా
అది గదిగో
ఒక యుద్ధం అరెరె
ఆగెనె ఆ సైన్యం
ఆపాదించెను ఆ జైంటు
ఆయెను సౌలు సైన్యం పైంటు
అడుగడుగో ఒక చిన్నోడు
అరెదైవిక రోషం ఉన్నోడు
చేతిలో వడిసెలు పట్టాడు.
ఆ జైంట్ పకపక నవ్వాడు
విసిరితే వడిసెల రాయి
కొట్టింది దేవుడెనోయి (2)
గొల్యాతాయెను జీరో
దావీదే ఇక హీరో (2)
అదిగదిగో ఒక యుద్ధం అరెరె
అగెనే ఆ సైన్యం
1. ఉదయకాలము మధ్యాహ్నము
సాయంకాలము చీకటివేళలో
చింతలేదు బాధ లేదు
భయము లేదులే
యేసు ఉన్నాడు
నాలో యేసు ఉన్నాడు (2)
2. లోకమునకు వెలుగైన
ఆ యేసే దారి చూపును
చింతలేదు బాధ లేదు
భయము లేదులే
యేసు ఉన్నాడు.
నాలో యేసు ఉన్నాడు(2)
1. నా చిన్ని కన్నులు యేసుకిచ్చాను.
నా చిన్ని చెవులు యేసుకిచ్చాను
నా చిన్ని పెదవులు యేసుకిచ్చాను.
నేను యేసుకై జీవించెదను
2. నా చిన్ని హృదయము యేసుకిచ్చాను
నా చిన్ని హృదయములో పాపముండదు
అపవాదికి హృదయములో చోటేలేదు
నేను యేసుకై జీవించెదను
నడుం కట్టి ఓడ కట్టె నోవాహు
మూడు మేడలోడ కట్టె నోవాహు (2)
కిటికి పెట్టి కీలు పూసెను
తలుపు దాని ప్రక్కనుంచెను (2)
హోయ్ హోయ్
1. ఉబికి ఉబికి నీరు వచ్చెను
నీటిపై ఓడ తేలెను
2. కొండ మీద ఓడ ఆగెను
క్రొత్త భూమ్యాకాశాము చూసెను
నే జీవించు ప్రతి క్షణం యేసయ్య
ఇచ్చిన వరం-నే జీవించు ప్రతి
దినం యేసయ్య ఇచ్చిన వరం
అర్పించెద అర్పించెద
నా హృదయాన్ని అర్పించెద
సమర్పించెద సమర్పించెద
నా సమస్తం సమర్పించెద
మిలమిల మెరసే చుక్కలు
ఆకాశంలో జ్యోతులు
ఎవ్వరనేకులను
యేసు వైపు త్రిప్పెదరో
వారే ఆ చుక్కలు వారే ఆ జ్యోతులు
హల్లెలూయ హల్లెలూయా
మిలమిల మెరిసే చుక్కలం
ఆకాశంలో జ్యోతులం
మేము అనేకులను
యేసు వైపు త్రిప్పెదము
మేమే ఆ చుక్కలం
మేమే ఆ జ్యోతులం
హల్లెలూయ హల్లెలూయా