చిన్ని బిడ్డవా నీవు చిన్ని బిడ్డవా
యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా (2)
1. యేసు వలె నీవు నడిచెదవా
యేసు కొరకు నీవు జీవించెదవా
2. యేసు వార్తను చాటెదవా
నశించువారినిరక్షించెదవా
చిన్ని బిడ్డవా నీవు చిన్ని బిడ్డవా
యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా (2)
1. యేసు వలె నీవు నడిచెదవా
యేసు కొరకు నీవు జీవించెదవా
2. యేసు వార్తను చాటెదవా
నశించువారినిరక్షించెదవా
చిట్టి చేతులతో చిన్నారి పాప
బుడి బుడి నడకలతో ముద్దోచ్చే బాబు
వింటావా యేసుని స్వరము వింటావా
తీస్తావా తీస్తావా యేసుకు తలుపు తీస్తావా
1. మంచుకు తడిసిన తలతో
గాయం పొందిన చేతితో
తలుపు తట్టగా ప్రేమతో పిలవగా
రమ్మని తలుపు తీస్తావా
నా స్నేహం యేసుతోనే
నా గమ్యం క్రీస్తులోనే
నా తల్లిదండ్రులు నన్ను విడిచిన
యేసు నన్ను విడువడు
నా హితులందరు నన్ను మరచిన
యేసు నన్ను మరువడు
1. జగతికి రూపము లేనప్పుడు
నను సృజియించెను
పిండముగా నేనున్నప్పుడు
నను ఏర్పరచెను
చేయి పట్టి నడిపే దేవుడుండగా
భయమిక నన్ను చేరదు
తన కంటిపాపల నన్ను కాయును
శ్రమయు నన్నేమి చేయదు
2. నా ప్రభు అరచేతిలో నేను
చెక్కబడియుంటిని
తన కరముల నీడలో నిలచి
స్తోత్రము చేయుదును
నేను చేయు స్తుతుల మూలముగా
ఒక దుర్గమును స్థాపించెను
ఆయువు మొదలు జీవితాంతము
చంకనెత్తుకును ప్రియప్రభువే
కలిసి వచ్చిరి నడుం కట్టిరి
నెహెమ్య వెంట నడిచి వచ్చిరి
గోడకట్టు వారు
హోయిరబ్బ హోయిరబ్బ
బండలెత్తు వారు
హోయిరబ్బ హోయిరబ్బ
బల్లె బల్లె బల్లె బల్లె హోయిరబ్బ
కత్తి పట్టి గోడ కట్టినారబ్బ
1. యెహోవా మన పక్షమున
యుద్ధము చేయుననుచు
పాడైపోయిన యెరుషలేమును
ప్రార్ధించి కట్టెను నెహెమ్య
సునో సునో సుంకరి ప్రార్ధన
దేఖో దేఖో దీన ప్రార్ధన
తగ్గించుకున్న ఈ ప్రార్ధన
దేవునికి ఇష్టమైన ప్రార్ధన
కన్నులెత్తి ఆకశంబు వైపు
చూడ ధైర్యము చాల లేదు
పాపినైన నన్ను కనికరించమనుచు
సుంకరి ప్రార్ధించెను
తగ్గించుకున్న ఈ ప్రార్ధన
దేవునికి ఇష్టమైన ప్రార్ధన
వచ్చె వచ్చె తిరిగొచ్చె
చిన్న కుమారుడు ఇంటికొచ్చె
చనిపోయి మరల బ్రతికి వచ్చె
తప్పిపోయి మరల తిరిగి వచ్చె
యు టర్న్ తీసుకున్నాడు
తన మిస్టేక్ తెలుసుకున్నాడు.
1. అల్లంత దూరాన కనిపించగా.
ప్రేమతో పరుగెత్తి ముద్దు పెట్టెగా
మంచి వస్త్రం తెచ్చి తొడిగించెను
ఇరుగుపొరుగు పిలిచి
-విందు చేసెను
గిర గిర తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి
తిరిగి తిరిగి నెమలి వలె నే ఆడెద
గల గల పారే పారే పారే పారేపారే
పా పారే అలల వలె నే పొంగెద
1. తెల్లని వస్త్రము ధరియించెద
దేవుని మహిమకై జీవించెద
ఈ సౌందర్యము నా దేవునిదే
నా దేవుని మహిమకే నే వాడెద
2. యేసుని శిష్యునిగా ఉండేద
ఆయన సువార్త నే చాటెద
పరలోకముకై వేచియుండేద
జీవ కిరీటము నే పొందెద
నా చిన్ని హృదయంలో
యేసు ఉన్నాడు(4)
తన ప్రేమనే నాకు చూపి
తన వారసులుగా మము చేసెను
అ.ప.: నాలో సంతోషం నాలో ఉత్సాహం
యేసయ్యే నింపాడు.
నాలో సంతోషం నాలో ఉత్సాహం
యేసయ్య నింపాడు (2)
1. లాలించును నను పాలించును
ఏ కీడు రాకుండా నను కాపాడును
తన అర చేతిలో నన్ను చెక్కుకొనెను
ముదిమి వచ్చు వరకు
నన్ను ఎత్తుకొనును
2. హత్తుకొనును నను ఓదార్చును
ఎల్లప్పుడు నాకు తోడుండును
ఏ కష్టాలు నష్టాలు ఎదురొచ్చినా
మన ప్రభు యేసుపై
నీవు ఆనుకొనుము
క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన
క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ
హ్యాపి క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4)
1. క్రీస్తులోనే విశ్వాసం
క్రీస్తులోనేఉల్లాసం
క్రీస్తులోనే అభిషేకం
క్రీస్తులోనే సమస్తం ॥హ్యాపి॥
2. యేసులోనే రక్షణ
యేసులోనే స్వస్థత
యేసులోనే విడుదల నమ్మితే నిత్యజీవం ॥2॥హ్యాపి॥
రెప రెప లాడె పతాకం
గుస గుస లాడె చిరు గాలి (2)
మిల మిల మెరిసె కెరటాలు
బిర బిర సాగే సెలయేరు (2)
చెప్పేదొకటే చెల్లెమ్మ
చెప్పేదొకటే తమ్మయ్యా (2)
జయము మనదే (2)
యేసులో విజయం మనదే
బిర బిర సాగిపో
మిల మిల మెరిసిపో
గుస గుస ప్రార్ధించు
రెప రెప జయించు
జయము మనదే
యేసులో విజయం మనదే