నాకున్న చిన్ని ఆశ / Naakunna Chinni Aasha

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

చిట్టి పొట్టి పాపను నేను
చిన్నారి పాపను నేను (2)

యేసయ్యా నిన్ను చూడాలని
నాకున్న చిన్ని ఆశ
యేసయ్యా నిన్ను చేరాలని
నాకున్న చిన్ని ఆశ         ||చిట్టి||

నీ సన్నిధిలోనే ఉండాలని
నాకున్న చిన్ని ఆశ
నీ సన్నిధిలో పాట పాడాలని
నాకున్న చిన్ని ఆశ         ||చిట్టి||

నీకై నేను జీవించాలని
నాకున్న చిన్ని ఆశ
నిన్నే నేను సేవించాలని
నాకున్న చిన్ని ఆశ      ||చిట్టి||

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Chitti Potti Paapanu Nenu
Chinnaari Paapanu Nenu (2)

Yesayyaa Ninnu Choodaalani
Naakunna Chinni Aasha
Yesayyaa Ninnu Cheraalani
Naakunna Chinni Aasha       ||Chitti||

Nee Sannidhilone Undaalni
Naakunna Chinni Aasha
Nee Sannidhilo Paata Paadaalni
Naakunna Chinni Aasha       ||Chitti||

Neekai Nenu Jeevinchaalani
Naakunna Chinni Aasha
Ninne Nenu Sevinchaalani
Naakunna Chinni Aasha      ||Chitti||

Capo on 4th Fret Chord (C)
C            Am        G
Chitti Potti Paapanu Nenu
                  C
Chinnaari Paapanu Nenu (2)
C        Am    F      C 
Yesayyaa Ninnu Choodaalani
G               C 
Naakunna Chinni Aasha
C        Am    F      C 
Yesayyaa Ninnu Cheraalani
G               C 
Naakunna Chinni Aasha       ||Chitti||
C    Am          F      C 
Nee Sannidhilone Undaalni
G               C
Naakunna Chinni Aasha
C    Am              F      C
Nee Sannidhilo Paata Paadaalni
G               C
Naakunna Chinni Aasha       ||Chitti||
C      Am        F      C
Neekai Nenu Jeevinchaalani
G               C
Naakunna Chinni Aasha
C     Am    F        C
Ninne Nenu Sevinchaalani
G               C
Naakunna Chinni Aasha      ||Chitti||

విత్తనాలు మూటకట్టి / Vithanalu Moota Katti

విత్తనాలు మూటకట్టి

ఎడ్లబండి మీద పెట్టి

విత్తనాలు విత్తుటకు బయలుదేరే ఛల్‌

విత్తనాలు విత్తుటకు బయలుదేరే

పొలములోన విత్తనాలు విత్తబోయే ఛల్‌

పొలములోన విత్తనాలు విత్తబోయే

యేసయ్య మాటలు బల్‌ బల్‌ బల్‌

అద్భుత సత్యం ఛల్‌ ఛల్‌ ఛల్‌

బల్‌ బల్‌ బల్‌ ఛల్‌ ఛల్‌ ఛల్‌

1. గంపలోన విత్తనాలు

చేతిలోకి తీసుకొని

పొలములోన విత్తనాలు వెదజల్లె

దారిపక్క విత్తనాలు కొన్ని పడితే

పక్షులొచ్చి రివ్వున ఎత్తుకెళ్ళెనే దేఖో

2 గంపలోన విత్తనాలు

చేతిలోకి తీసుకొని

పొలములోన విత్తనాలు వెదజల్లె

మంచినేల విత్తనాలు కొన్ని పడితే

నూరంతలూ పంట చేతికొచ్చె దేఖో.

మంచి కాపరి మంచి కాపరి / Manchi Kaapari Manchi Kaapari

మంచి కాపరి మంచి కాపరి

నన్ను కాయు వాడు మంచి కాపరి

నిన్ను కాయు వాడు మంచి కాపరి

1. మంచి కాపరి ప్రాణం పెట్టెను

తిరిగి లేచెను నన్ను రక్షించెను

2 మంచి కాపరి జయము నిచ్చును

జయించు వారికి కిరీట మిచ్చును

3 మంచి కాపరి మరల వచ్చును సిద్ధపడిన వారిని కొనిపోవును

ఒకటి రెండు మూడు / Okati Rendu Moodu

ఒకటి రెండు మూడు

ఆ యేసు వైపు చూడు

నాలుగు ఐదు ఆరు

బహు జోరుగా పాడు

అ.ప: నిరీక్షణ అనుక్షణం

యేసులోనే ఉంచు

దీక్షతో సాగుతూ పరీక్షలో నెగ్గు

1. ఏడు ఎనిమిది తొమ్మిది

ఆ యేసుతో ఉంటే నెమ్మది

యేసుని సన్నిధి

సంతోషానికి పెన్నిధి

కోరుకో నేడే కోరుకో / Koruko Nede Koruko

కోరుకో నేడే కోరుకో

నీకేమి కావాలో కోరుకో

1. సినిమా కధలు అల్లరి ఆటపాటలు

దొంగతనాలు చిలిపి చేష్టలు

వీటిని నీవు కోరితే

నరకమే నిత్య నరకమే ॥కోరు॥

2. యేసు రాజు పట్టణం

బంగరు వీధులమయం

నిత్యము ఆనందం

సుఖ సంతోషాలమయం

వీటిని నీవు కోరితే

అర్పించు హృదయమర్పించు ॥కోరు॥

దేవుని పిల్లలం / Devuni Pillalam

దేవుని పిల్లలం

మనమేసుని వారసులం (2)

ఎన్నడు మమ్ము విడువడు

ఏనాడు మమ్ము ఎడబాయడు (2)

1. భూమ్యాకాశములు సృజించిన దేవుడు

ఆకాశ పక్షులను పోషించు నా దేవుడు

నన్ను చేరదీయును

నన్ను కూడ పోషించును          ॥దేవు॥

2. విశ్వాసమే నా బలము

అపజయం నాకు లేదు

యేసు నాతో ఉన్నారు.

ఇక భయమే నాకు లేదు

క్రీస్తు నాలో ఉన్నారు

ఇక దిగులే నాకు లేదు             ॥దేవు॥

అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే / Ammo Ammo Ascharyakarude

అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే

అమ్మో అమ్మో అద్భుతకరుడే

నోటిమాటతో చేసేస్తున్నాడే

కనుసైగతో ఆపేస్తున్నాడే

1. నాల్గు రోజులైంది

లాజరు మరణించి

తిరిగి లేపాడు యేసయ్య వచ్చి

పుట్టు గుడ్డివాని వైపు ప్రేమగా చూచి

చూపునిచ్చాడు మట్టి ముద్దను రాసి

అమ్మో ఆశ్చర్యం అమ్మో అద్భుతం

2. గాలి వాన చేత

శిష్యులు భయపడుతుంటే

వాటిని గద్దించి నెమ్మది నిచ్చాడే

సేన దయ్యములచేత

బ్రతుకు పాడౌతుంటే

వాటిని తరిమేసి

క్రొత్త జీవితమిచ్చాడే

అమ్మో ఆశ్చర్యం అమ్మో అద్భుతం

యెహోవా కొరకు ఎదురు చూచువారు / Yehova Koraku Yeduru Chuchuvaaru

యెహోవా కొరకు

ఎదురు చూచువారు

నూతన బలమును పొందెదరు

1. పక్షిరాజువలె రెక్కలు

చాపి పైకెగురుదును

2. అలయక పరుగెత్తెదరు

సొమ్మసిల్లక సాగిపోయెదరు

ఓ దేవా మన్నే తీసి / O Deva Manne Theesi

ఓ దేవా మన్నే తీసి

చక్కనైన నిన్నే చూసి

ముచ్చటగా నన్నే చేశావా

ఓ భల్లె భల్లె భల్లె

నీ రూపం నాకిచ్చుటయే

గొప్పగా ఉన్నదయా

జీవాత్మ నాలో నింపగనే

జీవిగనైతినయా

భల్లె భల్లె భల్లెగా (2)

భల్లె భల్లె భల్లెగా చేసావు

భల్లె భల్లె భల్లెగా (2)

హల్లెలూయ నీకే చేస్తాను

తెల్లారింది వేళ త్వరగా నిద్దుర లేదా /Thellarindi Vela Thwaragaa Niddura Leda

తెల్లారింది వేళ త్వరగా నిద్దుర లేదా

మనమంతా ఆయన సృష్టేరా

పక్షుల కోలాహ వేళ

ప్రభువును స్తుతించవేరా

వాటికంటే శ్రేష్టులు మనమేరా

1. అడవిరాజు సింహమైనను

ఆకలంటు పిల్లల్లన్నను

యేసు రాజు పిల్లలం మనం

పస్తులుంచునా

వాడిపోవు అడవి పూలకు

రంగులేసి అందమిచ్చెను

రక్తమిచ్చి కొన్న మనలను

మరచిపోవునా

2. చిన్నదైన పిచ్చుకైనను

చింతవుందా మచ్చుకైనను

విత్తలేదు కోయలేదని

కృంగిపోవునా

వాటికన్ని కూర్చువాడు

నీ తండ్రి యేసేనని

నీకు ఏమి తక్కువ కాదని

నీకు తెలియునా