ప్రేమ కలిగి యుండుము
ప్రేమే యేసని చాటుము
ప్రేమలో నిలచి యుండుము
ప్రేమను చూపుము
1. భక్త హనోకు నడచెను
ఇష్టుడైన దేవునితో
శ్రమలు శోధనలు
కలిగిన విడువక
2. దావీదు దానియేలు
నడచిరిగా ప్రియులుగా
శత్రువైన సింహమైన
విడువక నమ్మికతో
ప్రేమ కలిగి యుండుము
ప్రేమే యేసని చాటుము
ప్రేమలో నిలచి యుండుము
ప్రేమను చూపుము
1. భక్త హనోకు నడచెను
ఇష్టుడైన దేవునితో
శ్రమలు శోధనలు
కలిగిన విడువక
2. దావీదు దానియేలు
నడచిరిగా ప్రియులుగా
శత్రువైన సింహమైన
విడువక నమ్మికతో
పిల్లలారా చిన్న పిల్లలారా
మీరు దేవుని సంబంధులు
సాతానుతో వద్దు వద్దు పొత్తు
1. దేవుని మార్గము వెలుగు
సాతాను మార్గము చీకటి
వెలుగు బాటలో నడవండి
తారలై ఇల వెలగండి
2. దేవుని రాజ్యము మీదే
రమ్యమైన రాజ్యము
జీవజలములు త్రాగుదురు. జీవ ఫలములు తిందురు
రాత్రియందు వెలుగు జ్యోతులవలె
వెలుగుదును నేను ఈ లోకంలో
యేసు జ్యోతిగా దివ్య జ్యోతిగా
వెలుగుదును నేను ఈ లోకంలో
1. మాటలలోను చేతలలోను
చూపులలోను వినికిడిలోను
యేసు చెప్పినట్లుగా నే చేసెదను (2)
యేసు ప్రతిబింబముగా నే సాగెదను
2. మోసము వీడి దోషము వదలి
ఇశ్రాయేలువలె నేనుండెదను
వీరుడైన యేసునే నే చాటెదను
రోషముతో సాతానుని ఓడిరచెదను
చిన్నారి పాపలం మేము
చిన్నారి బాబులం మేము
యేసయ్య ఒడిలో కూర్చుండెదము
యేసయ్య మాటలే నేర్చుకుందుము
1. లోకము పాపము మాకొద్దు
ఆ యేసు ప్రభువే మాకు చాలు (2)
ఆ జీవ వాక్యమే మాకు మేలు (2)
2 ప్రార్ధనా వాక్యము మాకు చాలు
సాతాను మాటలు మాకొద్దు (2)
సాతాను పాటలే మాకొద్దు (2)
1. కూ అనే కూసే కోకిల
కమ్మని గానం ఎవరిచ్చారే
ఆ యేసుడే ఆ యేసుడే
ఆ యేసుడే నాకిచ్చెను
2. మిల మిల మెరిసే తారాలారా
చక్కని కాంతిని ఎవరిచ్చారే
ఆ యేసుడే ఆ యేసుడే
ఆ యేసుడే మాకిచ్చెను
3. చక చక ఈదే చేపలారా
ఈదుట మీకు ఎవరు నేర్పిరి
ఆ యేసుడే ఆ యేసుడే
ఆ యేసుడే మాకు నేర్పెను
4.గల గల పారే సెలయేరు
పరుగు తీయుట ఎవరు నేర్పిరి?
ఆ యేసుడే ఆ యేసుడే
ఆ యేసుడే నాకు నేర్పెను
జీవిత నావలో నే సాగెదన్
ప్రార్ధనతోనే పయనించెదన్
1. ఎస్తేరువలెనే నిన్ను విడువక
హన్నావలె నీకై వేచియుందును
ప్రార్ధించెదన్ ప్రార్ధించెదన్
యేసుతో కలసి నే సాగెదన్
2. నా చిన్న దోనెను యేసుకిత్తును
నా యేసు నేను కలసి పయనింతుము
ప్రార్ధించెదన్ ప్రార్ధించెదన్
యేసుతో కలసి నే సాగెదన్
రక్షణ బండి రమ్మంటూ
చేతులు చాచింది
రాకడ బండి వేగంగా వచ్చేస్తున్నది
రక్షణ నీకు లేనిచో మోక్షం లేదు (2)
అగ్ని గుండమే యేసు లేనిచో
రక్షణ యేసే మోక్షం యేసే
1. వెళ్ళిన బండి మరల రాదు
ఆగమంటే ఆగదు
వెళ్ళక ముందే రక్షణ పొందు
యేసే మార్గము
యేసు దొరికే సమయమిదే
యేసే దేవుడు
యేసు వార్త చాటి చెప్పే
తరుణం నేడేరా ఇక సమయం లేదురా
రారా ఓ తమ్ముడా
రావేఓ చెల్లెలా
సండేస్కూలుకు పరుగున రారండి
1. సండేస్కూల్లో పాటలు ఉంటాయిరా
యేసయ్య మాటలు నేర్పుతారురా
బైబిల్లో కధలెన్నో చెబుతారురా
ఆనందం ఆనందం సంతోషమే
2. మాట్లాడే బొమ్మలు చూపిస్తారురా
చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారురా
ఆటల పోటీలెన్నో పెడతారుగా
స్కిట్స్ గిఫ్ట్స్ కూడా ఉంటాయిరా
బుద్ధియు జ్ఞానమునుగల బిడ్డను నేను
బుద్ధిగ శుద్ధిగను ఇలలో బ్రతికెదను
1. తండ్రిని తల్లిని ఘనపరతున్
ఆనందపరచెదను
చెప్పిన మాటకు ఎదురు చెప్పక
లోబడి యుండెదను (2)
2. జ్ఞానపు మాటలు పలికెదను
జ్ఞానముగా నేనడిచెదను
జ్ఞానము నేనని యేసనెను
యేసే చాలును ఆ యేసే చాలును
చెవులు ఉన్నాయా
వినే చెవులు ఉన్నాయా?
ఫస్ట్ వినాలి నెక్ట్స్ నమ్మాలి
చెవులు ఉంటే తప్పక నీవు వినాలి
విను ఇదే ఆఫర్ వినకపోతే డేంజర్..
యేసు మాట వింటే నీవు బతుకుతావు
1. సాతాను మాటలా? దేవుని మాటలా?
ఏది వింటావు? ఏది చేస్తావు?
కాకి విన్నది చేప విన్నది
గాడిద విన్నది సృష్టి విన్నది
యేసయ్య విన్నాడు ప్రాణం పెట్టాడు.
వింటేనే రక్షణ యేసుకరణ ॥చెవు॥
2. ఫ్రెండ్స్ మాటలా? పేరెంట్స్ మాటలా?
ఏది వింటావు? ఏది చేస్తావు?
బూతు మాటలా? సినిమా పాటలా?
వద్దు బాబోయ్ దురద చెవులు
దేవుని మాటలు వినే చెవులుఉండాలని బైబిల్లో మనకోసమే వ్రాయబడినది ॥చెవు॥