చిన్ననాటి జీవితం
చిరునవ్వుల సంబరం
అందని అంబరం
అందాల సుందరం
బుల్లి బుల్లి మాటలు
బంగారు మాటలు
చిన్ని చిన్ని నడకలు
చెరగని యేసు బాటలు
చిన్ని మనసులో
చల్లని యేసు వరములు
చిన్ని చూపులు
చిరు దివ్వె వెలుగులు
చిన్ని భావాలు చిన్నవారి ఆగాలు
యేసులేని జీవితం
అంతా అయోమయం
యేసుతోనే జీవితం
ఎంతో ప్రయోజనం
మంచి కాపరి యేసే
సిలువలో ప్రాణమిచ్చెను
గొప్ప కాపరి ఆయనే
సమాధి గెలిచి లేచెను
ప్రధాన కాపరిగా వచ్చును
పరలోకములో చేర్చును ॥మంచి॥
1. తప్పిన చిన్న గొట్టెను
తెచ్చెను స్వంతము చేసెను
నా పేరు యేసు పిలుచును
నా ముందు తానే నడచును ॥మంచి॥
2. దొంగ సాతానుకు చిక్కను
దేవుని చేతిలో చెక్కెను
యేసే నా ప్రియ కాపరి
ఆయనే అందరి ఉపకారి ॥మంచి॥
నీ చేతులతో నను చేసితివి
నీ చేతులలోనే నను చెక్కితివి
నీ చేతులతో నన్నెత్తుకొంటివి (2)
చేతులుంచి దీవించి ఆదరించితివి
చేతులెత్తి నిన్నే స్తుతియింతును
చేతులెత్తి యేసయ్య ప్రార్ధింతును
1. స్వస్థపరచిన నీ మహిమ చేతులు
సమృద్ధినిచ్చిన అద్భుత చేతులు
సాయపడిన గాయాల రక్త చేతులు
సిలువలో చాచి పిలిచే ప్రేమ చేతులు
చేతులెత్తి నిన్నే స్తుతియింతును
చేతులెత్తి యేసయ్య ప్రార్ధింతును
నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం
మాలాంటి వారిదే పరలోక రాజ్యం (2)
మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనే
పరలోక రాజ్యమని యేసు చెప్పెను (2) ||నాలాంటి||
నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొని
ముద్దాడి ముచ్చటించి దీవించెను (2) ||నాలాంటి||
Naalaanti Chinnalante Yesayyakishtam
Maalaanti Vaaride Paraloka Raajyam (2)
Manasu Maari Chinna Pillala Vanti Vaaralaithene
Paraloka Raajyamani Yesu Cheppenu (2) ||Naalaanti||
Naalaanti Chinnavaarini Yesayya Etthukoni
Muddhaadi Muchchatinchi Deevinchenu (2) ||Naalaanti||
బాలలందరు వేగమే రండి
యేసయ్య సన్నిధి చేరగ రండి
బైబిల్లో వాక్యాలు నేర్వగ రండి
యేసుని స్తుతియింప ఆశతో రండి
ప్రార్ధన చేయగా పరుగున రండి
పాటలు నాట్యము చేయగ లెండి
విశ్వాస వీరులుగా మారగ రండి
వెలుగైన యేసు
నడువగ రండి
నా ధ్యానము గానము ప్రాణము యేసే
నా ప్రార్ధన ఆరాధాన సమర్పణ దేవునికే
ధ్యానింతును వాక్యము దివారాత్రము
జీవింతును యేసుతోనే చిరకాలము
1. మర్మము దేవుని వాక్యము
నిర్మలము క్షేమాధారము
ఆనంద ప్రవాహము జీవము
అది ఆహారము జీవనాధారము
2. దేవుని స్వరమే ఆ వాక్యము
దైవస్వరూప వాక్య దర్శనము
మదిలోన మంటలు రేగెను
మండెదను యేసుని ప్రకటింతును
చిన్న పిల్లలను నా యొద్దకు వారిని
రానీయుడని ప్రభుయేసు చెప్పెను
అ.ప.: ఈలాంటిది వారిదే పరలోకము
మార్పు నొందితేనే ప్రవేశము
1. నీ బాల్యదినములయందే
స్మరణకు తెచ్చుకొనుము
దుర్దినములు రాకముందేనీ సృష్టికర్తను॥ఈలా॥
2. బాలుడు నడిచే త్రోవను నేర్పుము
పెద్దవాడైనప్పుడు తొలగిపోడు ॥ఈలా॥
చింత నీకు వలదు
ఓ చిన్ని తమ్ముడా
నీ కంట నీరు వలదు
ఓ చిన్ని చెల్లెలా
అంతా యేసే తీర్చును
చింత యేసే బాపును
1. బీదనని బాధ వద్దు
ఓ చిన్ని తమ్ముడా
చీప్ గా చూస్తారని చింత వద్దు
ఓ చిన్ని చెల్లెలా
చింత బాధలన్ని తీర్చును యేసేగా
ఎందరో నిరాకరించినా
ఆదరించునేసేగా ॥2॥చింత॥
2. ఒంటరినని తలంచవద్దు
నీ జంట యేసేగా
ప్రేమ చూపు వారు లేరని
ప్రార్ధన మానకుమా
భయము చెందకు అభయమేసేగా
తుంటరులెల్ల కొట్టుచుండ
ప్రేమ చూపెగా ॥2॥చింత॥
అన్నా ఓరన్నా పెద్దన్నా
అన్నా ఓరన్నా చిన్నన్నా
చిన్న చిన్న ప్రాణులు
వాటి తెలివి తేటలు
వాటినైన చూచి బుద్ధి తెచ్చుకోరా
వాటి నడత చూచి
బ్రతుకు మార్చుకోరా
1. చీమలను చూడరా చిన్నన్నా
వాటి చురుకు చూడరా పెద్దన్నా
రాజు లేడురా నేత లేడురా
వాటి నడత చూచి బుద్ధి తెచ్చుకోరా
వాటి బ్రతుకు చూచి
మనసు మార్చుకోరా ॥అన్నా॥
2. గోడ మీద బల్లి చూడు చిన్నన్నా
గొప్ప ఇంట ఉంటుంది చూడరన్నా
చిన్న మిడతలు వాటి ఐకమత్యము
వాటినైన చూచి బుద్ధి తెచ్చుకోరా
వాటి నడత చూచి బుద్ధి తెచ్చుకోరా
వాటి బ్రతుకు చూచి
బ్రతుకు మార్చుకోరా ॥అన్నా॥