పిల్లలము మేమందరము / Pillalamu Memandaram

పిల్లలము మేమందరము

నిను స్తుతియింప వచ్చితిమి

ప్రభువా నీవే నీతిరాజ

ఘనత మహిమ చెల్లింతుము

1. మా పాపములను క్షమియించి

మాకొసగు ఆశీర్వాదం

సుందర మనోహర స్వర్గములో

మమ్ముల ప్రవేశింప చేయు ॥పిల్ల॥

2.వాక్యము ప్రార్ధన సేవలో

మా హృదయమును మార్చుము

మాదు కాళ్ళు చేతులు వాడుకొనుము నీ మహిమకై ॥పిల్ల॥

నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి / Naa Koka Thellangi Nee Koka Thellangi

1. నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి

దైవ పిల్లలకు తెల్లంగి

నేను మోక్షం చేరగా

తెల్లంగి ధరించుకొని

చుట్టు చుట్టు తిరిగి వచ్చెదన్‌ (2)

2. నాకొక వాయిద్యం నీకొక వాయిద్యం

దైవ పిల్లలకు వాయిద్యం

నేను మోక్షం చేరగా

వాయిద్యం వాయించుకుంటు

చుట్టు చుట్టు తిరిగి వచ్చెదన్‌ (2)

3. నాకొక కిరీటం నీకొక కిరీటం

దైవ పిల్లలకు కిరీటం

నేను మోక్షం చేరగా

కిరీటం ధరించుకొని

చుట్టు చుట్టు తిరిగి వచ్చెదన్‌ (2)

ఉదయ సాయంత్రమెన్నడు / Udayam Sayanthrammennadu

ఉదయ సాయంత్రమెన్నడు

ప్రార్ధించ యేసు నేర్పించెను (2)

ప్రార్ధింతును ప్రార్ధింతును

ప్రార్ధింతును యేసువలె (2)

1. దానియేలవలె ఎల్లప్పుడు

సిగ్గుపడక ప్రార్ధింతును (2)

ఆత్మతోను సత్యముతో

ఎల్లప్పుడు ఆరాధింతున్‌ (2)

ఎంతో ఎంతో ఎంతో సంతోషం / Entho Entho Entho Santhosham

ఎంతో ఎంతో ఎంతో సంతోషం

యేసయ్య మాట వింటే సంతోషం

ఎంతో ఎంతో ఎంతో ఆనందం

యేసయ్య ఉంటే ఆనందం

1. నా బాధలన్ని బాపును యేసు

నా చింతలన్ని తీర్చును యేసు

ప్రార్ధన ఆలకించి

అన్నీ అనుగ్రహిస్తాడు

2. తన మార్గము చూపించును యేసు

తన బాటలో నడిపించును యేసు

యేసయ్య మనకు తోడుగా ఉంటే

ఎంతో సంతోషం

జాబిల్లి కంటే చల్లనా / Jaabilli Kante Challana

జాబిల్లి కంటే చల్లనా

నా యేసు ప్రేమ

ఆ మంచు కంటే తెల్లనా..

నా యేసు ప్రేమ

అమ్మ కంటే చక్కన

తేనె కంటే తియ్యన

నా యేసు ప్రేమ (4)

1. సంపంగి కంటే సువాసన

నా యేసు ప్రేమ

శరాత్ర కంటే సుభావన

నా యేసు ప్రేమ

చెలిమి కంటే తియ్యన

కలిమి కంటే చక్కన

నా యేసు ప్రేమ (4)

హైలెస్సో ఎలో ఎలో హైలెస్స / Hailessa Elo Elo Hailessa

హైలెస్సో ఎలో ఎలో హైలెస్స

నా చిన్ని నావలో నా

చిన్నారి నావలో

యేసయ్యకు చోటు ఉన్నది

నా యేసయ్యకు చోటు ఉన్నది

హైలెస్సో ఎలో ఎలో హైలెస్స

1. గాలి తుఫానులు ఎదురు వచ్చినా

తూలి నేనొక్కమారు పడబోయిన

నా యేసు అది చూచి తన చేయినే చాచి

కాపాడుకుంటాడుగా

2. అలలేచి నావపై పడబోయిన

పిలిచేందుకు నోట మాట రాకున్నను

నా యేసు నను చూచి తన శక్తినే వీచి

రక్షించుకుంటాడుగా

3 దరి చేరే దారి ముందు కానకున్నను

దిక్కులన్ని చిక్కనైన చీకటైనను

నా యేసు తన వెలుగును

నా దారిలో పరచి

దరి చేర్చనున్నాడుగా

ల ల లా పాటలే పాడెదన్‌ / La La Laa Paatale Paadedan

లల్లలాల లల్లలాల లల్ల లల్ల

ల ల లా లా లల్లా లలా

1. పాటలే పాడెదన్‌

నేను బలే బలే పాడెదన్‌ (2)

యేసు రక్షించె

నేను బలే బలే పాడెదన్‌ ॥లల్ల॥

2. డాన్స్‌ చేస్తాను నేను బాగా చేస్తాను

పాపము క్షమియించెన్‌

నేను డాన్స్‌ చేస్తాను

యేసు పాపము క్షమియించెన్‌

నేను డాన్స్‌ చేస్తాను          ॥లల్ల॥

3. గంతులు వేస్తాను

నేను గంతులు వేస్తాను

విడుదల చేసాడు

నేను గంతులు వేస్తాను   

యేసు విడుదల చేసాడు

నేను గంతులు వేస్తాను    ॥లల్ల॥

మేమాయన పిల్లలం / Memayana Pillalam

మేమాయన పిల్లలం

ఎల్లప్పుడు ప్రేమింతుం

మేమాయన పిల్లలం

ప్రభు మహిమ చాటెదం (2)

మేమాయన పిల్లలం

సువార్తను చాటింతుం (2)

మేమాయన పిల్లలం

ఆరాధింతుం (2)

చిన్నోడా చిన్నిదానా / Chinnoda Chinnidana

చిన్నోడా చిన్నిదానా

యేసుని నమ్మారా

నమ్మకపోతే నరకమని

యేసు చెప్పెరా బైబిల్‌ చెప్పెరా

1. ప్రతివారం గుళ్ళోకెత్తే

దేవుని పిల్లలమంటారా

పాస్టర్లు పెద్దలు మా వాళ్ళంటూ

యేసుని నమ్మక యుంటారా

భిన్నంగా హుందాగా ఉంటే చాలునా

చదువులున్నా ఆస్తులున్నా నీతో రావురా

2. క్రిస్టియన్గా పుట్టామని

కుంటిగా మసలుతున్నారా

సరదాలు చందాలు పరలోకం చేర్చునా

ద్రాక్షాలు తిన్నవారి పళ్ళు పులియురా పాపినని ఒప్పుకుంటే నీకే మేలు రా