నోవహు నోవహు నోవహు / Noahu Noahu Noahu

నోవహు నోవహు నోవహు

ఓడను సిద్ధము చేయుము

1 భూమిపై పాపము అధికమాయెను

నీతియు ప్రేమయు లేకపోయెను

మనుష్యులందరు చెడిపోయిరి

దేవుని ఉగ్రతకు పాత్రులైరి

2. నీతిమంతుడైన నోవహును

ఓడలో దేవుడు దాచియుంచెను

జలప్రళయములో లోకము నశించెను

నోవహు కుటుంబము తప్పించబడెను

చిత్రా చిత్రాలవాడే మన యేసయ్యా / Chitra Chitralavaade Mana Yesayya

చిత్రా చిత్రాలవాడే మన యేసయ్యా

చాలా చిత్రాలవాడే మన యేసయ్యా

దయగల వాడమ్మో

ఈ జగమున లేనే లేడమ్మో

1. రాయి రప్ప మొక్కవద్దు

చెట్టు పుట్ట కొలవవొద్దు (2)

దయగల వాడమ్మో

ఈ జగమున లేనే లేడమ్మో                            ॥చిత్రా॥

2. లోకానికి వచ్చినాడు

పాపుల రక్షించినాడు .

పరిశుద్ధుడొచ్చినాడు

ఆ పరమును తెచ్చినాడు                   ॥చిత్రా॥

స్తుతులు పాడెదం యేసుప్రభునకు / Sthuthulu Paadedam Yesu Prabhunaku

స్తుతులు పాడెదం యేసుప్రభునకు

సమస్తమిచ్చినా సృష్టికర్తకు (2)

మరణమున్‌ జయించినా

యేసుప్రభువును ఆరాధించి

పూజింతుము రారాజును

సండేస్కూలంటే మాకిష్టం / Sunday Schoolante Maa Kistam

సండేస్కూలంటే మాకిష్టం

వన్డే మ్యాచ్‌ అయిన మానేస్తాం

వానైన ఎండైన కానీ

వరదైన బురదైన కానీ

వుయ్‌ షల్‌ గో నన్‌ కెన్‌ స్టాప్‌ అజ్‌

సండేస్కూల్‌ సండేస్కూల్‌

వుయ్‌ లవ్‌ యు సండేస్కూల్‌ (2)

1. ఎన్నెన్నో సాంగ్స్‌ ఉంటాయ్‌

ఎన్నెన్నో స్టోరీస్‌ ఉంటాయ్‌

ఎన్నెన్నో గేమ్స్‌ ఉంటాయ్‌

ఎన్నెన్నో డ్రామాస్‌ ఉంటాయ్‌

2. బాల్యంలో ప్రభువును ఎరిగుంటే

బలమైన భావి ఉంటుంది

బాల్యంలో బైబిల్‌ చదివుంటే

బైబిల్‌ మన భారం మోస్తుంది

పిల్లలందరూ రారండీ / Pillalandaru Rarandi

పిల్లలందరూ రారండీ

మాతో చేతులు కలపండి

సండేస్కూల్లో చేరండి

చక్కని కధలు వినరండి

1. చదువులు ఎన్ని చదివినా

యేసే లేకుంటే సున్నా (2)

యేసే మనతో ఉంటే

విజయము మనదే ఐనట్టే

2. సాకులు చెప్పక రండి

సమయము ఇప్పుడే చేరండి

సమయము పోతే రాదండి

సత్యము చెబుతున్నామండి

చిన్నారి పాప విన్నావా / Chinnari Papa Vinnava

చిన్నారి పాప విన్నావా

చిన్నారి బాబు విన్నావా

విశ్వాసముంటే కృపతో నీవు

రక్షింపబడతావని

ఇది దేవుని వరమేనని(2) ॥చిన్నా॥

1. మారుమూలలో నివసించే

మెఫీబొషెతువలె నీవుంటే (2)

మేడ గదులలో నివసింప

దేవుని కృపనే పొందితివి

మహా దేవుని కరుణను పొందితివి

ప్రేమలు పంచే పువ్వులం / Premalu Panche Puvvulam

ప్రేమలు పంచే పువ్వులం

శాంతిని పెంచే గువ్వలం

పరలోకానికి వారసులం (2)

స్వామి యేసునకు స్నేహితులం

స్నేహితులం స్నేహితులం

గొర్రెలారా గొర్రెలు నా వెంటా రండి / Gorrelara Na Venta Randi

గొర్రెలారా గొర్రెలు నా వెంటా రండి

మాట మీరి పోయి మీరు

తప్పిపోకండి (2)

ముండ్లపొదలలో పడి చిక్కకండి

రాయి రప్ప దారులలో నడవకండి

సరళమైన మార్గమందు నడచి రండి త్రోవతప్పి ఎక్కడకు వెళ్ళ వద్దండి(2)

మనసులు మురిపించే / Manasulu Muripinche

మనసులు మురిపించే

మమతలు కురిపించే (2)

నవ్వులు చిందించే

మువ్వల సంగీతం (2)

వింటేనే ఆనందం ఎంతో ఆహ్లాదం

1. దేవుడు చేసిన బొమ్మలం

యేసుని ప్రేమకు వారసులం

మోసము లెరగని మెలికలం

క్రీస్తే మెచ్చిన బాలలం

పాపుల కోసం ప్రాణం పెట్టిన / Paapula kosam Praanam Pettina

పాపుల కోసం ప్రాణం పెట్టిన

యేసుకు దండాలు

ప్రార్ధన మాకు నేర్పిన దేవా

నీకే స్తోత్రాలు

పాపులమయ్యా దయ చేయి

దండిగ దీవెనలు

పిల్లలమయ్యా పేదలమయ్యా

విను మా ప్రార్ధనలు

1. కల్లాకపటం ఎరగని మమ్ము

రక్షించాలయ్యా

పిల్లలమైన మాపై నీ దయ

కురింపించాలయ్యా

ఎల్లప్పుడు నువు నీ కనుసన్నలో

మేముండాలయ్యా

చల్లగ చూసి మము కాపాడే

దైవం నీవయ్యా