నా చిన్ని హృదయం నీకే అంకితం / Naa Chinni Hrudayam Neeke Ankitham

నా చిన్ని హృదయం నీకే అంకితం

నా చిన్ని జీవితం నీకే అంకితం

యేసయ్యా నా యేసయ్యా

1. సాతాను నన్ను శోధించినా

నేన్నెనడు నిన్ను విడవను

గొప్ప గొప్ప దేవుడే మన యేసయ్య / Goppa Goppa Devude Mana Yesayya

గొప్ప గొప్ప దేవుడే మన యేసయ్య

ఎంతో గొప్ప దేవుడే మన యేసయ్య

1 కానా విందులో నీటిని రసముగా

మార్చినాడే యేసయ్య

మొదటి దానికన్నా రెండవ ద్రాక్షరసం

ఎంతో రుచి ఆయెనే

2 లాజరు చనిపోయి నాల్గు రోజులాయెనే

యేసయ్య కన్నీరు విడిచినాడులే

లాజరును బయటకి రమ్మన్నాడు

లేచి వచ్చాడు ఆశ్చర్యపోయారు

బలే బలే యేసయ్య / Bale Bale Yesayya

బలే బలే యేసయ్య

బంగారు యేసయ్య

జాలిగల యేసయ్య

చక్కని నా యేసయ్య

1. అద్భుతాలు ఆశ్చర్యాలు

ఎన్నెన్నో చేశావు

నీ మాటతో స్వస్థత

నిను తాకితే స్వస్థత

2. సిలువలో చనిపోయి

మూడవ రోజు లేచినావు

నిను నమ్మితే రక్షణ

నీ సన్నిధే దీవెన

సంతోషం సంతోషం / Santhosham Santhosham

సంతోషం సంతోషం

యేసయ్య మనలో ఉంటే

సంతోషం సంతోషం

1. మన పాపం దూరమైతే

సంతోషం సంతోషం

యేసు ప్రభువు తోడుంటే

సంతోషం సంతోషం

2. యేసు ప్రభుని నమ్మితే

సంతోషం సంతోషం

పరలోకం చేరితే

సంతోషం సంతోషం

నయమాను ఎలీషా మాట విన్నాడు / Nayimaanu Elisha Maata Vinnadu

నయమాను ఎలీషా మాట విన్నాడు.

వింటూనే యొర్దానులో

మునిగి లేచాడు (2)

మునిగి లేచాడు బుడ బుడ

మునిగి లేచాడు (4)

ఒకటి కాదు రెండు కాదు మూడు

నాలుగు ఐదు ఆరు కాదయ్య ఏడు సార్లు

మునిగి లేచాడు (2)

మునిగి లేచాడు బుడ బుడ

మునిగి లేచాడు (4)

చూశారా అద్భుతము ఎలా జరిగెనో

నయమాను కుష్టంతా తొలిగిపోయెను

మునిగి లేచాడు (2)

మునిగి లేచాడు బుడ బుడ

మునిగి లేచాడు (4)

మేమంటే ఎవరో తెలుసా తెలుసా / Memante Evaro Thelusa Thelusa

1. మేమంటే ఎవరో తెలుసా తెలుసా

దేవుని ఉద్యానవనం

మేమేంటో మీకు తెలుసా తెలుసా

దేవుని నక్షత్రాలం

దేవుని బహుమానం

దీవెన పుత్రులం

దేవుని సంపాద్యం

ఆయన సర్వస్వం

2. మేమేం చేస్తామో తెలుసా తెలుసా

యేసయ్యను ఉరేగిస్తాం

మేమేలా ఉంటామో తెలుసా తెలుసా

యేసయ్య బాణాలుగా

భావి పౌరులుగా

బైబిల్‌ వీరులుగా

యేసు వెంటే వెళ్తూ

అపవాదిని తరిమేస్తాం

మేమౌతామో తెలుసా తెలుసా

యేసయ్య ప్రియ శిష్యులం

మా గురి ఏమిటో తెలుసా తెలుసా

సువార్తను చాటే సేవకులం

నడిచెద నేను నడిచెదన్‌ / Nadicheda Nenu Nadichedan

నడిచెద నేను నడిచెదన్‌

యేసుతో నేను నడిచెదన్‌

1. యేసుతో నడిచినా

హనోకులా నడిచెదన్‌

2. నీతితో నడిచినా

నోవహులా నడిచెదన్‌

3. విధేయుడై నడిచినా

మోషేలా నడిచెదన్‌

అనగానగా సమూయేలు / Anaganagaa Samuyelu

అనగానగా సమూయేలు

ఒక చిన్నబాలుడు

ఎల్కానా హన్నాల ముద్దుల బాలుడు

ఏలీతో దేవునికి పరిచర్య చేసాడు.

ఇశ్రాయేలీయుల ప్రవక్తగా

నియమింపబడ్డాడు

1.సమూయేలు మోకరించి ప్రార్ధన చేసాడు

దేవుడే సమూయేలును పేరుతో పిలిచాడు.

దేవునికి మనుష్యులకు విధేయుడైన

సమూయేలు చిన్న వయసులో

దేశమంతా పేరు పొందాడు.

2. సమూయేలు ఇతరుల కొరకు

ప్రార్ధన చేశాడు

దావీదును రాజుగా అభిషేకించాడు.

ప్రవక్తగా న్యాయాధిపతిగా

నియమితుడైన సమూయేలు

దేవునిచే ప్రజలచే ప్రేమింపబడ్డాడు

నక్కి నక్కి వచ్చినాడు జక్కయ్య / Nakki Nakki Vacchinaadu Jakkayya

నక్కి నక్కి వచ్చినాడు జక్కయ్య

జక్కయ్య పొట్టి జక్కయ్య

మేడిచెట్టు ఎక్కుతూ జారినాడు జక్కయ్య

జక్కయ్య పొట్టి జక్కయ్య

అలసిపోయి కొమ్మ మీద వాలినాడు

యేసు కొరకు ఎదురు చూసినాడు

జక్కయ్య పొట్టి జక్కయ్య

1. కన్నులెత్తి చూచినాడు యేసయ్య

కిందకు దిగి రమ్మన్నాడేసయ్య.

పరుగున దిగి వచ్చినాడు జక్కయ్య

యేసయ్యను చేర్చుకొనే జక్కయ్య

జక్కయ్య పొట్టి జక్కయ్య

చిన్నా చిన్న గొర్రెపిల్లను

చిన్నా చిన్న గొర్రెపిల్లను

యేసు ప్రియ బిడ్డను

సంతసముగా సాగిపోయెదన్‌

చెంత యేసు నాతో ఉండగా

1. ముండ్ల పొదలలో నేను నడచివెళ్ళినా

తోడేళ్ళ మధ్యలో సంచరించినా

తొట్రిల్లను నేను చింతించను

తోడుగా నా యేసు ఉండగా

2. పచ్చిక గల చోటికి నన్ను నడుపును

శాంత జలముతో

నన్ను తృప్తి పరచును

నా కాపరి నా ప్రియుడేసుడే

చిరకాలము నన్ను కాయును