శ్రమలలో భ్రమలలో / Shramallalo Bhramalalo

శ్రమలలో భ్రమలలో

శోధనలో వేదనలో

బాధలలో హింసలలో

మన విశ్వాసమే మనకు విజయము

దుష్టుడు సాతానుడు బాధించినా

కష్టము నష్టము కలిగినను

శరీరమంతా కృశించినను

పరిశోధనలెన్నో కలిగినను

మరవకు విడవకు యేసు ప్రభువుని

వాక్యపు వెలుగులో నడచెదం / Vyaakapu Velugulo Nadichedam

వాక్యపు వెలుగులో నడచెదం

జీవపు బాటలో వెళ్ళెదం

1. సత్యవాక్యమే మనకు దీపము

నిత్యజీవము మనకు చూపును

నిత్యము లోకమందు వెలుగుచుండెను

2. రక్షణనే వెలుగు సౌలు మీద పడెను

తక్షణమే అతడు నేల మీద పడెను

ఆ క్షణమే తెలిసికొనె యేసే వెలుగని

భూమి మీద గాని ఆకాశమందే గాని / Bhoomi Meeda Gaani Akashamande Gani

భూమి మీద గాని ఆకాశమందే గాని

భూమి క్రింద గాని నీళ్ళయందే గాని

దేని రూపమైనను చేయకూడదని

దేనికైనను సాగిలపడవద్దని యేసనెను

1. షడ్రకు మేషాకు అబేద్నగోలు

వాక్యమును నమ్మిరి

ధైర్యముగా నుండిరి

నిలచిరి అవమానపు అగ్నిలో

గెలిచిరి అనుమానపు పందెములో

ఆకాశంలో చూడుము / Aakashamlo Chudumu

ఆకాశంలో చూడుము

సూర్యచంద్ర తారలు

నలుదిక్కులను చూడుము

గడ్డి పువ్వులను

వీటన్నిటిని ప్రభువే చేసెను

1. ఉన్నత పర్వతములు

మంచుతో కప్పబడెను

అక్కడ నుండి నీరు

నదిలా ప్రవహించున్‌

2. మోకాళ్ళూని ప్రార్ధింతున్‌

ప్రభుని ఆరాధింతున్‌

యేసే మా ప్రభువా రక్షంకుండవు

చిన్ని బిడ్డలము మమ్మును దీవించు

చుక్‌ చుక్‌ చుక్‌ చుక్‌ పరిగెడదాం / Chuk Chuk Chuk Chuk Parugedadam

చుక్‌ చుక్‌ చుక్‌ చుక్‌

పరిగెడదాం (3)

అ.ప.: ఒడి ఒడిగా పరిగెడదాం

మనగురినే చేరుకుందాం

1. గిద్యోను యుద్ధం చేసే

మిద్యానీయులతో

దైవశక్తితో జయమును పొంది

గురినే చేరెను

2. బారాకు యుద్ధం చేసే సిసెరాతో

నలుబది ఏళ్ళు ఇశ్రాయేలుకు

నెమ్మది కలిగెను

3. దేవుని నీవు ప్రేమిస్తే

సువార్త ప్రకటించు

బహుమానం పొందకోరితే.

గురి చేరుకో

అమ్మకు లోబడు చిన్న పిల్లలము / Ammaku Lobadu Chinna Pillalamu

అమ్మకు లోబడు చిన్న పిల్లలము

నాన్నకు లోబడు ముద్దు బిడ్డలము

వేద వాక్యం పఠించు

చిన్న పిల్లలము

యేసునే ప్రేమించు

ముద్దు బిడ్డలము

యేసన్న నిన్ను పిలచుచున్నాడు / Yesanna Ninnu Pilachuchunnadu

యేసన్న నిన్ను పిలచుచున్నాడు

హోసన్న పాటలు పాడు నేడు

లెమ్ము విడచి రమ్ము

నమ్ము హృదయమిమ్ము

యేసుని చేరుకొమ్ము

1. యెరికోలో గ్రుడ్డి వాడు

త్రోవ ప్రక్కనుండినాడు

కరుణకై వేడినాడు

తీమయి కుమారుడు ॥యేస॥

2. పిలిచెను తన దాసులుగా

నింపెను వాక్యము నోట

మలిచెను తన పాత్రలుగా

పంపెను శుభవార్త చాట  ॥యేస॥

చిన్నారి చుక్కలము / Chinnari Chukkalamu

చిన్నారి చుక్కలము

సిరిమల్లె పువ్వులము

చల్లనైన యేసయ్య ఒడిలో

చక్కగా కూర్చుందుము ॥చిన్నా॥

1. జీవముండెను యేసులో

జీవమే జీవపు వెలుగు

నీతి సూర్యుడు నిజమైన వెలుగు

నిన్ను నన్ను వెలిగించును ॥చిన్నా॥

2. చీకటి జీవితం వదిలెదము

వెలుగు బాటలో నడిచెదము

యేసే వెలుగని చాటెదము

వెలుగును అందరికి పంచెదము ॥చిన్నా॥

వర్షాకాలంలో ఎండాకాలంలో / Varshakaalamlo Endakaalamlo

వర్షాకాలంలో ఎండాకాలంలో

చలి చలి గాలులలో

అన్ని వేళలలో మన దేవుడు

తోడుగా ఉన్నాడు.

ఘన మహిమలు ఎన్నో పొందాడు.

1. కోయిల పాటలతో

సిరిసిరి మువ్వలతో చప్పట్లు కొట్టెదను

గంతులు వేసెదను

మన యేసుని కొరకై జీవింతును

నా జీవితమంతా స్తుతియింతును

రావద్దనవద్దు నన్ను / Raavadduanavaddu Nannu

రావద్దనవద్దు నన్ను

బ్రతిమాలవద్దు

నిన్నే నేను వెంబడిరతున్‌

నీ జనమే నా జనము

నీ దేవుడే దేవుడని

మోయాబు విడచెన్‌

నయోమితో వచ్చెన్‌

1. రొట్టెల ఇల్లైన బేత్లహేమునకు

పట్టు విడువకను వచ్చెను రూతు

నూతన జీవమును

నూతన బ్రతుకును నూతన మార్గములో నడిచెను