దీవించే దేవుడు సమృద్ధినీయగా
కృతజ్ఞత కలిగి
ఆయనకొరకీయవా
1. తెలివి తేటలైనా నీ బలము సంపదైనా
దేవుని బహుమానమే గదా
తండ్రి ఆశీర్వాదమేగదా
2. రెండు కాసులైనా అది చిన్న
కానుకైనా దేవునికి ఎంతో ఇష్టం
నీ అర్పణ ఎంతో శ్రేష్టం
దీవించే దేవుడు సమృద్ధినీయగా
కృతజ్ఞత కలిగి
ఆయనకొరకీయవా
1. తెలివి తేటలైనా నీ బలము సంపదైనా
దేవుని బహుమానమే గదా
తండ్రి ఆశీర్వాదమేగదా
2. రెండు కాసులైనా అది చిన్న
కానుకైనా దేవునికి ఎంతో ఇష్టం
నీ అర్పణ ఎంతో శ్రేష్టం
దగ్గరగా దగ్గరగా
యేసుకు దగ్గరగా సాగిపో
చేరువగా చేరువగా
పైపైకి చేరువగా ఎక్కిపో
1. దినదినము క్షణక్షణము
వాక్యములో ప్రార్ధనలో
ఉన్నత శిఖరం ఎక్కిపో
పరలోక మహిమకు సాగిపో
2. శోధనలో వేదనలో
కష్టములో నష్టములో
అలయక సొలయక ఎక్కిపో రక్షకుని వెంట సాగిపో
దేవుని పనికై కానుకలీయుమా
ఆయనిచ్చు మేళ్ళు పొందుమా
నీవిచ్చినది కొంచెమైనను
నీ ఫలములు విస్తారములగును
1. విధవరాలు ఇచ్చినవి
రెండు కాసులైనను
తన జీవనమంతయు ఇచ్చివేసెను
నీవిచ్చినది కొంచెమైనను
నీ ఫలములు విస్తారములగును
2. మాసిదోనియ సంఘస్థులు
బీదలైనను బహు దాతృత్వము
కలిగి ప్రభునకిచ్చిరి
నీవిచ్చినది కొంచెమైనను
నీ ఫలములు విస్తారములగును
దేవుని మార్గములో
ముందుకు సాగుదమా
యేసే ఆ మార్గమని
జనులకు చాటుదమా
1. రక్తం కార్చి ప్రాణం పోసి
సిద్ధము చేసినది
శిక్ష బాపి రక్షణిచ్చే
నీతి మార్గమది
2. ఇరుకైన మార్గమది పరముకు
చేర్చునది పరీక్షల మార్గమది
నిరీక్షణిచ్చునది
దావీదు గొల్యాతును
వడిసెలతో కొట్టి చంపెను
తిప్పి తిప్పి కొట్టి చంపెను
తిప్పి తిప్పి కొట్టి చంపెను
ఒకటి కాదు కాదు రెండు కాదు
కాదు మూడు కాదు నాలుగు కాదు
ఐదు రాళ్లను తీసుకొని
ఒకే రాయితో కొట్టి చంపెను
తిప్పి తిప్పి కొట్టి చంపెను
తిప్పి తిప్పి కొట్టి చంపెను