క్రిస్మస్‌ అంటేనే క్రీస్తుకు ఆరాధన / Christmas Ante Ne Kreesthuku Aaradhana

క్రిస్మస్‌ అంటేనే క్రీస్తుకు ఆరాధన

క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ

హ్యాపి క్రిస్మస్‌ మెర్రి క్రిస్మస్‌ (4)

1. క్రీస్తులోనే విశ్వాసం

క్రీస్తులోనేఉల్లాసం

క్రీస్తులోనే అభిషేకం

క్రీస్తులోనే సమస్తం        ॥హ్యాపి॥

2. యేసులోనే రక్షణ

యేసులోనే స్వస్థత

యేసులోనే విడుదల నమ్మితే నిత్యజీవం        ॥2॥హ్యాపి॥

కలుగదు రక్షణ ఏ నామములో / Kalugadu Rakshana Yee Namamulo

కలుగదు రక్షణ ఏ నామములో

కలుగును క్షమాపణ యేసు

నామములో

1. యేసు అంటే రక్షకుడు

తెలుసుకో తెలుసుకో

క్రీస్తు అంటే అభిషిక్తుడు

తలచుకో తలచుకో

ప్రభు యేసుని నమ్ముకో

హృదయములో చేర్చుకో

ప్రతిదీవెన అందుకో

పరలోకం పొందుకో

2. భేదమేమి లేదు అందరు

పాపులు పాపులు

వాదమేమి లేదు

యేసే దేవుడు దేవుడు

గాయాలు పొంది.

రక్తమంత కార్చెను ప్రతి పాపిని కడిగి పవిత్రపరచెను

క్రీస్తుయోధులం క్రీస్తుయోధులం / Kreesthuyodhulam

క్రీస్తుయోధులం క్రీస్తుయోధులం

సిలువ జెండ ఎత్తి సాగెదం

1. సాతాను ఎదురించినా

లోకాశలు ఆకర్షించినా

విశ్వాస కర్త యేసు వైపే

చూచుచు సాగి వెళ్ళెదం                                ॥కీస్తు॥

2. మంచి పోరాటం పోరాడెదమ్‌

మా పరుగు కడముట్టించెదం

విశ్వాసమును కాపాడుకొందుము

జీవకిరీటం పొందెదం                     ॥క్రీస్తు॥

కోడి కూయు వేళ పరుగులెత్తెదం / Kodi kooyu Vela Parugulethedam

కోడి కూయు వేళ పరుగులెత్తెదం

బైబిల్‌ చేత పట్టుకొని సండేస్కూలుకు

జుం ల లా జుం ల లా

1. కమ్మనైన మాటలు ఎన్నో ఉంటాయి

తియ్యనైన పాటలు ఎన్నెన్నో వస్తాయి

అక్కా అన్నా తమ్ముడు చెల్లి

మనం కలసిపోదమా

యేసుని చెంతకు

మనం కలసిపోదమా

2. కొత్త కొత్త కధలు ఎన్నో చెబుతారు

బైబిలు వాక్యములు మరెన్నో నేర్పిస్తారు

అక్కా అన్నా తమ్ముడు చెల్లి

మనం కలసిపోదమా

యేసుని చెంతకు

మనం కలసిపోదమా

కలలు కనే యోసేపు / Kalalu Kane Yosepu

కలలు కనే యోసేపు

వాట్‌ యే బ్యూటిఫుల్‌ డ్రీమ్స్‌ నీకు

చిత్రమైన నిలువుటంగీ

వాట్‌ యే కలర్ఫుల్‌ డ్రస్సు నీకు

వాట్‌ యే వాట్‌ యే వాట్‌ యే

వాట్‌ యే బ్యూటిఫుల్‌ డ్రీమ్స్‌ నీకు

వాట్‌ యే వాట్‌ యే వాట్‌ యే

వాట్‌ యే కలర్ఫుల్‌ డ్రస్సు నీకు

1. ఫరోకు కల వచ్చి

కలవరము పొందెను

యోసేపు కల భావం చెప్పి

ప్రధాని ఆయెను

వాట్‌ యే వాట్‌ యే వాట్‌ యే

వాట్‌ యే సూపర్‌ వరము నీకు

క్రీస్తును ధరియించిన వాడను / Kreesthunu Dharinchina Vaadanu

క్రీస్తును ధరియించిన వాడను

నేను క్రైస్తవుడను

ప్రేమస్వరూపి ప్రియబిడ్డను

ప్రేమను పంచెదను

పొరుగువాడు ఆకలితో నుండ

రుచిగల ఆహారమెట్లు తిందును

కొంతైనను ఆహారమునిచ్చి

అతని ఆకలిని తీర్చెదను

కేవలము మాటలతో గాక

క్రియలతో ప్రేమను చూపెదను

2. పొరుగువాడు వస్త్రము లేకయుండ

విలువైన వస్త్రమెట్లు ధరియింతును

కొంతైనను నా స్వార్ధము మాని

అతని చలి నుండి రక్షింతును

కేవలము మాటలతో గాక

క్రియలతో ప్రేమను చూపెదను

కట్టబడ్డ గాడిద పిల్లను నేను / Kattabadina Gaadida Pillanu Nenu

కట్టబడ్డ గాడిద పిల్లను నేను

పట్టబడ్డాను అపవాదితోను

1. యేసయ్య నా నిజ యజమానుడు

సాతాను మోసంతో నను లొంగదీసాడు.

అయినను యేసయ్య కరుణించాడు.

నన్ను విడిపించ తన శిష్యులనంపాడు

2. నా పైకి ఎక్కి నన్ను ధన్యుని చేశాడు

యెరుషలేం వీధుల వెంట యాత్ర చేశాడు.

నా బ్రతుకు మార్చి నాకు ఘనత తెచ్చాడు.

ఆయన సేవజేయ అర్హత నిచ్చాడు.

కోయిలమ్మ పాటలో / Koilamma Paatalo

కోయిలమ్మ పాటలో

రాచిలుక మాటలో

దేవునికి మహిమయున్నది

అ.ప: ఓ తమ్ముడా ఓ చెల్లెలా

నీ నోట దేవుని స్తుతియున్నదా

1. వీచే చిరుగాలిలో

పూచే మరుమల్లెలో

దేవునికి మహిమయున్నది                   ॥ఓ॥

2. పారే సెలయేటిలో

సాగే మేఘాలలో దేవునికి మహిమయున్నది

కోయిలమ్మ పాటలో / Koyilamma Patalo

కోయిలమ్మ పాటలో

రాచిలుక మాటలో

దేవునికి మహిమయున్నది

అ.ప: ఓ తమ్ముడా ఓ చెల్లెలా

నీ నోట దేవుని స్తుతియున్నదా

1. వీచే చిరుగాలిలో

పూచే మరుమల్లెలో

దేవునికి మహిమయున్నది                            ॥ఓ॥

2. పారే సెలయేటిలో

సాగే మేఘాలలో

దేవునికి మహిమయున్నది                            ॥ఓ॥

కనుపాపను కాపాడునట్లు / Kanupapanu Kapaadunattlu

కనుపాపను కాపాడునట్లు

కాపాడుము

నను నీ కనుపాపగా (2)

నీ రెక్కల నీడలో

నను దాచియుంచు (5)