Back

Choose Song To View The Lyrics

నేనేమిటో నా మనసేమిటో మనుగడ ఏమిటో నీకు తెలుసునయ్యా

నేనేమిటో నా మనసేమిటో మనుగడ ఏమిటో నీకు తెలుసునయ్యా
నీవేమిటో నీ ప్రేమేమిటో నీ పిలుపు ఏమిటో నేను ఎరుగుదునయ్యా
వింతగా ఆకర్షించితివయ్యా అంతగా చెంతకు చేరితినయ్యా (2)
దయ చూపితివయ్యా
||నేనేమిటో||

1. నిజముకు నా స్థితిని ఎదుట యోగ్యము కాదే
నా అంతర్యము నీ చూడ స్పష్టము లేదే (2)
నేననే అతిశయమేమీ లేదే ఏదియు నాదని చూపనలేని (2)
సర్వం యెరిగితివే
||నేనేమిటో||

2. విలువగు దర్శనం నాకిచ్చి స్థిరపరిచితివి
వాక్యపు వెలుగులో నను నిలిపి ఓదార్చితివి (2)
అంతమైపోతిని అనుకుంటినయ్యా అంతలోకాచిన కరుణామయ (2)
నీ కృప చాలయ్య
||నేనేమిటో||

3. అకోరులోయలో నా వేదన చూచితివయ్య
షారోను పొలములో నీ చిత్తము తెలిపితివయ్యా (2)
శ్రమలలో సహనము నేర్పించితివి నిరీక్షణ ద్వారముగా మార్చితివి (2)
కటాక్షించితివి
||నేనేమిటో||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------