Back

Choose Song To View The Lyrics

నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో

నా విమోచకుడా యేసయ్యా
నీ జీవన రాగాలలో
నీ నామమే ప్రతిధ్వనించెనే

నీతిమంతునిగా నన్ను తీర్చి
నీదు ఆత్మతో నను నింపినందున
నీవు చూపిన నీ కృప నేమరువలేను
||నా విమోచకుడా||

జీవ వాక్యము నాలోన నిలిపి
జీవమార్గములో నడిపించి నందున
జీవాధిపతి నిన్ను నే విడువలేను
||నా విమోచకుడా||

మమత లూరించే వారెవరు లేరని
నిరాశల చెరనుండి విడిపించివందున
నిన్ను స్తుతించకుండా నేనుండలేను
||నా విమోచకుడా||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------