Back

Choose Song To View The Lyrics

నలిగిన రెల్లును విరువని దేవుడు విరిగిన మనస్సును లక్ష్యము చేస్తాడు

నలిగిన రెల్లును విరువని దేవుడు
విరిగిన మనస్సును లక్ష్యము చేస్తాడు
బలము కలిగిన ఆయుధంగా మార్చి
అద్భుతాలు చేసే శక్తిని చేకూర్చి
దీవిస్తాడు జయమిస్తాడు

శ్రమల అలలతో కొట్టబడి
భ్రమల సుడులలో నెట్టబడి
అటుఇటు వంగినా బహుగా క్రుంగినా
అదరిస్తాడు యేసు దేవుడు
పదును గలిగిన మ్రానుగ చేస్తాడు

అనుమానముతో కాల్చబడి
అపనమ్మికతో బ్రతుకు చెడి
ఆత్మలో నలిగినా హృదయం పగిలినా
బాగు చేస్తాడు యేసు దేవుడు
స్థిరమైన సాక్షిగా జీవింప చేస్తాడు
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-----------------------------------------
CREDITS : AR Stevenson
-----------------------------------------