Back

Choose Song To View The Lyrics

నా ప్రాణమా దిగులెందుకు నీ రక్షకుని స్మరియించుకో

నా ప్రాణమా దిగులెందుకు
నీ రక్షకుని స్మరియించుకో
మహిమోన్నతుడు బలవంతుడు
నీ పక్షమునే నిలిచెనుచూడు
లెవరా వీరుడా నిరాశను వీడరా నీ రాజు నిన్ను పిలిచెను
కదులు ముందుకు కదులు ముందుకు
అసాధ్యుడే నీకుండగా అసాధ్యము నీకుండునా
భయము వీడి నడవరా జయమునీదే జయమునీదే
||నా ప్రాణమా||

1. యేసులో విశ్వాసమే నీ చేతిలోని ఆయుధం
విడువకుండ పట్టుకో ఎన్ని శ్రమలు నీకు కలిగినా
లేమిలో కొలిమిలో ఒంటరివి కావు ఎన్నడూ
యేసు నీతో ఉండును నీ సహాయమాయనే
నీవు వెంబడించువాడు నీవు నమ్మదగిన దేవుడు
నీ శ్రమలు దూరపరచును నిన్ను గొప్పగా హెచ్చించును (2)
||నా ప్రాణమా||

2. గర్జించు సింహమువలె సాతాను వెంటపడినను
ఎదురుతిరిగి నిలబడు వాడు నిలువలేకపోవును
జయించెనేసు ఏన్నడో సాతాను ఓడిపోయెను
నీ ఎదుటనున్న శత్రువు ప్రభావము శూన్యమే
నీలోన ఉన్నవాడు లోకములనేలువాడు
నిర్భయముగా సాగిపో నీన్ను ఆపలేరు ఎవ్వరు (2)
||నా ప్రాణమా||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------