Back

Choose Song To View The Lyrics

నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు

నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు

1. ఆర్ఫాయు ఓమేగ వర్తమాన - భూత భవిష్యత్తులో నున్నవాడా
నా సర్వము నిర్వహించువాడా - సర్వాధికారి నిన్నే స్తుతించి
అర్పింతు నీకే నా ఆరాధన

2. ఏడు సువర్ణ దీపస్తంభముల - మధ్య సంచరించుచున్నవాడా
శుద్దీకరించితివి నన్ను - మేలిమిగ మార్చి సంఘమున
చేర్చితివి నిన్నే ఆరాధింతు

3. తెల్లని ఉన్నిని పోలియున్న - వెంట్రుకలు కలిగి యున్నవాడా
ఆలోచనకర్త నీవే నాకు - జ్ఞానమైతివి అసమానుండ
అర్పింతు నీకే నా ఆరాధన

4. సూర్యుని వంటి ముఖము కలిగి - అగ్నిజ్వాలల నేత్రముల్ కలిగి
దృష్టించితివి నా హౄదయమున్ - దహించితివి దుష్టత్వము
ప్రేమగల ప్రభూ నిన్నారాధింతు

5. అపరంజిని పోలిన పాదములు - కలవాడా తీర్పు తీర్చితివి
పాపము లోకములనిల - దుష్ట సాతానున్ సిలువలొ గెలిచి
విజయ మిచ్చినందుల కారాధింతున్

6. నీ నోటినుండి బయలువెడలె - రెండంచులు గల వాడి ఖడ్గము
అదియే పాత ఆదామును చంపె - నశింప చేసె నా శత్రుబలమున్
అర్పింతు నీకే నా ఆరాధన

7. ఏడు నక్షత్రములు పట్టుకొనిన - మొదటివాడా కడపటివాడా
సర్వ సంపూర్ణత నాకిచ్చితివి - అపాయములలో ఆదుకొనుచున్న
ఆమేన్ అనువాడా హల్లెలూయ
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Nene Unnavadanania Adhvitheeya Prabhu Aaradhinthu

1. Alphaayu Omega Varthamaana - Bhootha Bhavishyatthulo Nunnavaadaa
Naa Sarvamu Nirvahinchuvaadaa - Sarvadhikaari Ninne Sthuthinchi
Arpinthu Neeke Naa Aaradhana

2. Edu Suvarna Deepasthambhamula - Madhya Sancharinchuchunnavaadaa
Shuddheekarinchithivi Nannu - Melimiga Maarchi Sanghamuna
Cherchithivi Ninne Aaradhinthu

3. Thellani Unnini Poliyunna - Ventrukalu Kaligi Yunnavaadaa
Aalochana Karthave Neeve Naaku - Gnaanamaithivi Asamaanunda
Arpinthu Neeke Naa Aaradhana

4. Suryuni Vanthi Mukhamu Kaligi - Agnijwaalala Nethramul Kaligi
Drushtinchithivi Naa Hrudayamun - Dhahinchithivi Dushtatvamu
Premagala Prabhu Ninnaaraadhinthu

5. Aparanjini Polina Paadhamulu - Kalavaadaa Theerpu Theerchithivi
Paapamu Lokamulanila - Dushta Saathaanun Siluvalo Gelichi
Vijaya Micchinandhula Kaaraadhinthun

6. Nee Notinundi Bayaluvedhale - Rendanchulu Gala Vaadi Khadgamu
Adhiye Paatha Aadhaamunu Champe - Nashimpa Chese Naa Shathrubalamun
Arpinthu Neeke Naa Aaradhana

7. Edu Nakshathramulu Pattukonina - Modhativaadaa Kadapativaadaa
Sarva Sampoornatha Naakicchithivi - Apaayamulalo Aadukonuchunna
Amen Anuvaadaa Hallelujah

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------