Back

Choose Song To View The Lyrics

నీ ఆవరణమందున నిలిచే ధన్యత పొందిన

నీ ఆవరణమందున నిలిచే ధన్యత పొందిన (2)
ఏర్పరచబడిన నీ పిల్లలం (2)
నిలోన ఎదిగి ఫలియించేదం (2)
నీ మందిరము యొక్క సమృద్ధితో (2)
సంతృప్తినొందుచు జీవించేదం (2)
||నీ ఆవరణ||

ఈ మందిరము నిండుకొనియున్నది
అసమానమైన నీ తేజస్సుతో (2)
సన్మానించెదము పూర్ణాత్మతో (2)
మా మధ్య నీవుంచిన నీ మందిరమును నీ మందిరమును
||నీ మందిరము||

ఈ మందిరము వైపు నీ కన్నులు
తెరచియున్నవి రేయింబగలు (2)
సంతోషించెదము నీ మేళ్లతో (2)
నివసించి నీవిచ్చిన నీ మందిరములో నీ మందిరములో
||నీ మందిరము||

ఈ మందిరము కట్టబడియున్నది
నీ నామ ఘనతకు మహనీయుడా (2)
సంభాషించెదము నీ క్రియలను (2)
నీవే ప్రతిష్టించిన నీ మందిరమున నీ మందిరమున
||నీ మందిరము||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

--------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music & Voice : Dr.A.R.Stevenson
--------------------------------------------------------------------------------------------