Back

Choose Song To View The Lyrics

నమో యేసునాధా నాధా నమో జీవనాధా

నమో యేసునాధా నాధా నమో జీవనాధా సమాన విరహిత
సనాతనాత్మా సమున్నతోజ్వల ప్రశాంత ధామా
||నమో||

1. స్థావర జంగమ జగమందున నీ శక్తి స్వరూపము ప్రతిఫలింపగ భూ
వలయాకాశంబుల మించుచు భువన పాలనముజేసెటి ప్రభువా
||నమో||

2. ధరణీ మానవ విమోచనార్థము కరుణను జీవము లొసగిన ప్రభువా
పరమ కృపాభరితా మృతసారా వరసజ్జన హృదయాబ్జ విహారా
||నమో||
3. సుందర మలయజ గంధ ధూపముల చందముననుమా వినుతులు గొను
మా వందే దేవ దయాసందీప వందే శుభదానంద స్వరూపా
||నమో||
** TELUGU LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------