Back

Choose Song To View The Lyrics

నేను యేసును చూచే సమయం బహు సమీపమాయనే

నేను యేసును చూచే సమయం - బహు సమీపమాయనే
శుభప్రదమైన యీ నిరీక్షణతో శృతి చేయబడెనే నా జీవితం

అక్షయ శరీరముతో ఆకాశ గగనమున
ఆనందభరితనై - ప్రియయేసు సరసనే పరవసించెదను
||నేను||

రారాజు నా యేసుతో వెయ్యేండ్లు పాలింతును
గొర్రెపిల్ల సింహము ఒక చోటనే కలిసి విశ్రమించును
||నేను||

అక్షయ కిరీటముతో అలంకరించబడి
నూతన షాలేములో నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లెదను
||నేను||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **