Back

Choose Song To View The Lyrics

నా వల్ల కాదు దేవా యే కార్యమైనను నీవు పని చేయగా జరుగును ఏదైనా

నా వల్ల కాదు దేవా యే కార్యమైనను
నీవు పని చేయగా జరుగును ఏదైనా (2)

పగలంతయు కష్టపడి చేసినా
పని అంతా వర్థ్యము యేసయ్య (2)
నీవు సెలవిస్తే దేవా ఏదైనను (2)
సమాకూరును యేసయ్య
||నావల్ల||

ధనమంతయు ఎంత ఖర్చు చేసినా
లాభాలు ఏమి లేవయ్య (2)
నీవు కరుణిస్తే దేవా ఏదైనను (2)
పొందుకొందును యేసయ్య
||నావల్ల||

శక్తినంతయు ప్రయోగించి చూసినా
ఫలితాలు ఏమి లేవయా (2)
నీవు మాటిస్తే దేవా ఏదైననూ (2)
అనుభవింతును యేసయ్య
||నావల్ల||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

---------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Music, Tune, Vocals : Mallepogu Hananya
---------------------------------------------------------------------------------------------