Back

Choose Song To View The Lyrics

దైవప్రేమ మనలనెపుడు బంధించుగా

దైవప్రేమ మనలనెపుడు బంధించుగా దివిని భువిని దీన జనులను
దిరముగా కాపాడుగా
||దైవ||

1. పరమతండ్రి గద్దెముందట ప్రార్థనల్ మరిజేతుము పలు విధముల
మార్గములలో ప్రభువే తోడైయుండుగా
||దైవ||

2. నిత్యప్రభువు సత్యసేవను నిరతమును మదినుంతుము నిలిచియుందుము
క్రీస్తుకొరకై నిత్యసేవక జనముగా
||దైవ||

3. మనము విడిచి వెళ్లునపుడు మదిని కల్గును వేదన మనసు హృదయము
కలిసియుండగ మరల గలియుదు మెచ్చటో
||దైవ||

4. జనక తనయ పరిశుద్ధాత్మకు జయము మహిమయు ఘనతయు ఆదినుండి
యిపుడు యెపుడు అవని పరమున జెల్లుగా
||దైవ||
** TELUGU LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------