Back

Choose Song To View The Lyrics

దేవా నీవు దయచేసినా ఈ నూతన సంవత్సరం నా జీవిత క్షేమాభివృద్ధికి శుభ ఆరంభం

దేవా నీవు దయచేసినా
ఈ నూతన సంవత్సరం (2)
నా జీవిత క్షేమాభివృద్ధికి
శుభ ఆరంభం
నీలో నా ఆత్మీయ స్థితికి
పునః ప్రారంభo
||దేవా||

ప్రతి క్షణం ఆరాధించే
అపురూప బంధం నీవే
అనుక్షణం ఆస్వాదించే
అత్యంత అనురాగం నీవే (2)
నా జీవితానికి అర్ధం నీవే
నా గమ్యానికి తీరం నీవే
||దేవా||

ప్రతి దినం నను నడిపించే
నాకున్న ఆధారం నీవే
అనుదినం నేను ఆనందించే
నాలోన సంతోషం నీవే (2)
నా ఆశయానికి ఆదర్శం నీవే
నా ఆశ్రయానికి కోటవు నీవే
||దేవా||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-----------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Padala Suresh Babu
Vocals & Music : Yangala Ravi & Vijay Samuel
-----------------------------------------------------------------------