Back

Choose Song To View The Lyrics

దేవా నాయందు నీకు ఎంతో ప్రేమా

దేవా నాయందు నీకు - ఎంతో ప్రేమా
నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను
హల్లెలూయ ... (4)

1. దిన దినము నీదు ప్రేమ - రుచిచూచుచున్నాను
దయగల జీవాహారముతో - పోషించుచున్నావు
దేవా! నీ జీవ జలము - నాకిచ్చితివే
నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను

2. నా పాదములను నీవు - బండపై నిలిపితివి
నా యడుగుల నెల్ల నీవు - స్థిరపరచిన దేవుడవు
దేవా! నా కాశ్రయుడవు - నీవే కదా
నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను

3. సిలువలో నీ రక్తము కార్చి - నన్ను రక్షించితివి
సార్వత్రిక సంఘములోన - నన్నైక్య పరచితివి
దేవా నీ దయ నా యెడల - అత్యున్నతము
నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను

4. వాగ్దానములను నాలో - నెరవేర్చిన ఓ ప్రభువా
విదువక నా యెడల నీదు - కృప జూపుచున్నావు
దేవా! నీ మారని ప్రేమ - సంపూర్ణము
నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను

5. మృతిని గెల్చి మాకొరకై - తిరిగి లేచిన ప్రభువా
మా కొరకై త్వరలో రానై - యున్న మహిమ రాజా
దేవా! నీ సన్నిధి నాకు - ఎంతో ప్రియము
నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Deva Naayandhu Neeku - Entho Premaa
Nee Divya Prema Naalo - Uppongenu
Hallelooya ... (4)

1. Dina Dinamu Needhu Prema - Ruchichoochuchunnaanu
Dayagala Jeevaahaaramutho - Poshinchuchunnaavu
Deva! Nee Jeeva Jalamu - Naakichchithive
Nee Divya Prema Naalo - Uppongenu

2. Naa Paadhamulanu Neevu - Bandapai Nilipithivi
Naa Yadugula Nella Neevu - Sthiraparachina Devudavu
Deva! Naa Kaashrayudavu - Neeve Kadaa
Nee Divya Prema Naalo - Uppongenu

3. Siluvalo Nee Rakthamu Kaarchi - Nannu Rakshinchithivi
Saarvathrika Sanghamulona - Nannaikya Parachithivi
Deva Nee Daya Naa Yedala - Athyunnathamu
Nee Divya Prema Naalo - Uppongenu

4. Vaagdaanamulanu Naalo - Neraverchina O Prabhuvaa
Vidhuvaka Naa Yedala Needhu - Krupa Joopuchunnaavu
Deva! Nee Maarani Prema - Sampoornamu
Nee Divya Prema Naalo - Uppongenu

5. Mruthini Gelchi Maakorakai - Thirigi Lechina Prabhuvaa
Maa Korakai Thwaralo Raanai - Yunna Mahima Raajaa
Deva! Nee Sannidhi Naaku - Entho Priyamu
Nee Divya Prema Naalo - Uppongenu

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------