Back

Choose Song To View The Lyrics

దూత వచ్చింది వార్తను తెచ్చింది గొల్ల జ్ఞానులకా వార్త చెప్పింది

దూత వచ్చింది వార్తను తెచ్చింది
గొల్ల జ్ఞానులకా వార్త చెప్పింది శుభవార్త చెప్పింది
యేసయ్య జన్మించినాడని
లోక రక్షకుడు ఉదయించినాడని

ఆహా! లేఖనాలను నెరవేర్చుటకు
మనుష్యుల పాపభారమును మోయుటకు (2)
పరిశుద్ధునిగా పుట్టినాడు
పరలోకము నిను చేర్చుటకు (2)
సంబరాలతో ప్రచురిద్ధాము
సంగీత స్వరాలతో ప్రకటిద్ధాము

ఆహా! లోకమంతా వెలుగు నింపెను
మానవాళి బ్రతుకు పండెను (2)
అన్నిటిని సమకూర్చే మన ప్రభువు
కన్నీటిని తుడుచుటకు భువికొచ్చెను (2)
సంతోష గానాలతో నాట్యమాడేదం
సంగీత స్వరాలతో ప్రకటించేదం
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------
CREDITS : Lyrics: Karun Kumar
Vocals : Vara Prasad & Karun Kumar
-------------------------------------------------------