Back

Choose Song To View The Lyrics

దీనుల యెడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయ్యా

దీనుల యెడల కృప చూపువాడా
నీ దాసుని దాటిపోకయ్యా (2)
నీవే నా ఆధారము నా యేసయ్యా
నీవే నా ఆశ్రయము (2)
||దీనుల||

విరిగి నలిగి నేను ఉన్నానయ్యా
ఎదకోతతో నిన్నే చేరితినయ్యా (2)
అమ్మలాగ ఆదరించే దేవుడవు
అనాధగా నన్ను విడువని దేవుడవు (2)
||దీనుల||

విరోధుల అంబులకు అప్పగించకా
నా కవచం నీవై నన్ను కాపాడితివి (2)
నా శ్రమ నిందలను చూచితివి
దుఃఖము సంతోషముగా మార్చితివి (2)
||దీనుల||

నా చేయి పట్టి నన్ను నడిపించితివి
కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి (2)
క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు
కృతజ్ఞుడనై నేను జీవించెదను (2)
||దీనుల||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------------------
CREDITS : Bro Mathews, Krupa Ministries, Guntur
-------------------------------------------------------------------------------