Back

Choose Song To View The Lyrics

ప్రార్థన చేయవే నా మనసా ప్రాణనాధుని వేడవే నా మనసా

ప్రార్థన చేయవే నా మనసా
ప్రాణనాధుని వేడవే నా మనసా (2)

ధరణిలో ఎంతో విలువైనది
వెలకట్టలేని మహిమోన్నతమైనది (2)
బలమైన శోధనలో నీ బలముడికిపోగా
నీ విజయానికి సంకేతం ప్రార్థన మంజరి (2)
||ప్రార్థన||

కనిపెట్టి ప్రార్థించే అనువైన సమయం
దైవ తలంపులతో నింపబడే తరుణం (2)
గర్వపు ఛాయలు నిను విడిచిపోవును
ప్రియమార ప్రభు నిన్ను దర్శించు శుభవేళ
||ప్రార్థన||

ప్రభువే తనవారికి ఆనతినిచ్చిన
అత్యద్భుతమైనది ఇది దైవ ప్రణాళిక (2)
ఇలలోన మనుజులు వర్ణింపజాలని
విశ్వాసంతో నిండిన ప్రార్థన పరిమళం (2)
||ప్రార్థన||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Vocals : Pas.Adam garu, Gayatri Narayan Music : Joshua gotikala
-------------------------------------------------------------------------------------------