Back

Choose Song To View The Lyrics

ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసేద స్మరణం

ప్రభు యేసు నామమే శరణం
దినమెల్ల చేసేద స్మరణం
హృదయాత్మతో గృహ ధ్యానమే
పలికించే పెదవిని స్వరాలాపం
||ప్రభు యేసు||

కనుల పండుగ కనబడే నాధుడు
వీనుల విందుగా వినబడే నాదం (2)
ప్రియముగా నాలో కురిపించెనుగా
ఆత్మ ప్రవాహం ప్రభు వరములతో (2)
జయమౌ ప్రగతం ప్రభు నామం
||ప్రభు యేసు||

నీకు ముందుగా నడిచెద నేనని
నీతి బంధువై నడిపెను యేసు (2)
మార్గము నేనే జీవము నేనే
సత్యము నేనని పలికిన యేసే (2)
శరణం శరణం శుభ శరణం
||ప్రభు యేసు||

రాతి గుండెను కరిగించగనే
కాంతి గుండెలో వెలిగించెనుగా (2)
ఉదయించెను నా యేసు ప్రభావం
హృదయపు గానం యేసుని నామం (2)
స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం
||ప్రభు యేసు||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------