Back

Choose Song To View The Lyrics

ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము పాపములన్నియు

ప్రవహించుచున్నది - ప్రభు యేసు రక్తము
పాపములన్నియు - కడుగుచున్నది
పరమ తండ్రితో సమాధానము కలిగించుచున్నది

దుర్నీతి నుండి విడుదల చేసి
నీతిమార్గమున నను నడిపించును
యేసురక్తము క్రయధనమగును
నీవు ఆయన స్వాస్థ్యమౌదువు
||ప్రవ||

దురభిమానాలు దూరము చేసి
యధార్ధ జీవితం నీకనుగ్రహించును
యేసురక్తము నిర్దోషమైనది
నీవు ఆయన ఎదుటే నిలిచెదవు
||ప్రవ||

జీవజలముల నది తీరమున
సకల ప్రాణులు బ్రతుకుచున్నవి.
యేసురక్తము జీవింపజేయును
నీవు ఆయన వారసత్వము పొందెదవు
||ప్రవ||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **