Back

Choose Song To View The Lyrics

ప్రభూవా నీ వాత్యల్యం మా యెడల అనుదినము నూతనముగాను

ప్రభూవా నీ వాత్యల్యం మా యెడల
అనుదినము నూతనముగాను
పుట్టుచున్నందును బట్టి యేసయ్య
మేము నిర్మూలం కాలేదు దేవా స్తోత్రం

తోట్రిల్లకుండ మమ్మును కాచి తండ్రి యెదుట
నిర్ధోషులుగా నిలుపను శక్తిగల మా రక్షకా
మహిమయు మహాత్మ్యమున్ యుగయుగములును చెల్లును నీకే
మహిమయు మహత్మ్యమున్ తరతరములును కలుగునుగాక

వధగొర్రెపిల్ల యేసు రక్తము
పాపమెల్ల పరిహరించి శాపంబాపును
వధగొర్రెపిల్ల యేసు రక్తము
ఓ పాపిరా యేసు నొద్దకు
ఈ క్షణమే పాపం బాపును
తన యొద్దకు వచ్చువారిని
ఎంత మాత్రము ప్రభు త్రోసివేయడు

సిలువలో చూడుము ఆ ప్రేమ మూర్తి యేసు దేహమును
తనువంతయును రక్తధారలు నీకై బలియాయెను
ఏ రీతిగ నీవు త్రోసివేతువు నీకై చూపిన ఆ ప్రభుని ప్రేమను
ఇపుడె నీవు పరుగిడుచు రమ్ము జాగుచేయక త్వరపడుచు రమ్ము
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

--------------------------------------------
CREDITS : Vocals : Srilekha
--------------------------------------------