Back

Choose Song To View The Lyrics

క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి

క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారి
క్రీస్తే మహోపకారి – క్రీస్తే ఆ సిల్వధారి
||క్రీస్తే||

ముక్తి విధాత నేత – శక్తి నొసంగు దాత
భక్తి విలాప శ్రోత – పరమంబు వీడె గాన
||క్రీస్తే||

దివ్య పథంబురోసి – దైవంబు తోడు బాసి
దాసుని రూపు దాల్చి – ధరణి కేతెంచె గాన
||క్రీస్తే||

శాశ్వత లోకవాసి – సత్యామృతంపు రాశి
శాప భారంబు మోసి – శ్రమల సహించె గాన
||క్రీస్తే||

సైతాను జనము గూల్పన్ – పాతాళమునకు బంపన్
నీతి పథంబు బెంప – రుధిరంబు గార్చె గాన
||క్రీస్తే||

మృత్యువు ముళ్ళు తృపన్ – నిత్య జీవంబు బెంపన్
మర్త్యాళి భయము దీర్పన్ – మరణంబు గెలిచె గాన
||క్రీస్తే||

పరమందు దివిజులైన – ధరయందు మనుజులైన
ప్రతి నాలుక మోకాలు – ప్రభునే భజించు గాన
||క్రీస్తే||

ఈ నామమునకు మించు – నామంబు లేదటంచు
యెహోవా తండ్రి యేసున్ – హెచ్చించినాడు గాన
||క్రీస్తే||

-------------------------------------------------------------------
CREDITS : రావూరి రత్నము (Ravuri Rathnamu)
-------------------------------------------------------------------
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Kreesthe Sarvaadhikaari – Kreesthe Mokshaadhikaari
Kreesthe Mahopakaari – Kreesthe Aa Silvadhaari
||Kreesthe||

Mukthi Vidhaatha Netha – Shakthi Nosangu Daatha
Bhakthi Vilaapa Shrotha – Paramambu Veede Gaana
||Kreesthe||

Divya Pathamburosi – Daivambu Thodu Baasi
Daasuni Roopu Daalchi – Dharani Kethenche Gaana
||Kreesthe||

Shaashwatha Lokavaasi – Sathyaamruthampu Raashi
Shaapa Bhaarambu Mosi – Shramala Sahinche Gaana
||Kreesthe||

Saithaanu Janamu Goolpan – Paathaalamunaku Bampan
Neethi Pathambu Bempa – Rudhirambu Gaarche Gaana
||Kreesthe||

Mruthyuvu Mullu Thrumpan – Nithya Jeevambu Bempan
Marthyaali Bhayamu Deerpan – Maranambu Geliche Gaana
||Kreesthe||

Paramandu Divijulaina – Dharayandu Manujulaina
Prathi Naaluka Mokaalu – Prabhune Bhajinchu Gaana
||Kreesthe||

Ee Naamamunaku Minchu – Naamambu Ledatanchu
Yehovaa Thandri Yesun – Hechchinchinaadu Gaana
||Kreesthe||