Back

Choose Song To View The Lyrics

కన్నీరు తుడువబడెను కమనీయ ప్రేమలో

కన్నీరు తుడువబడెను కమనీయ ప్రేమలో
చింతలన్నీ తీర్చబడెను చెంత చేర్చు యేసునిలో
ఆశలన్నీ తీరెను ఆనంద యాత్రలో
వేదనంత తొలగెను విశ్వాస బాటలో
||కన్నీరు||

1. శ్రమయందు కృంగిన నన్ను లేవనెత్తే యేసు ప్రేమ
బంధకములలో నుండి విడిపించే దేవుని మాట
దీనులకు విందుగా మార్చెను నన్ను
తన విందుశాలకు తోడ్కొనిపోయెను
||కన్నీరు||

2. జీవాధాత అయినా క్రీస్తు నాలో జీవించే
కురిపించే నాపై దీవెన జల్లులు
ప్రకాశింప చేసెను వెలుగులేని చోట్లలో
జీవింపచేసెను విశ్వాస వీరునిగా
||కన్నీరు||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------