Back

Choose Song To View The Lyrics

కృపగల దైవమా కరుణించే దైవమా

కృపగల దైవమా - కరుణించే దైవమా
నీ కృపలో నన్ను దాచినావయ్య (2)
యేసయ్య నీకే వందనం - యేసయ్య నీకే స్తోత్రము-
యేసయ్య నీకే మహిమ నిరంతరం (2)
ఆరాధన నీకే యేసయ్యా (4)

1. కష్టనష్టాల సంద్రంలో - వ్యాధి వేదన బాధలలో -
కన్నతండ్రివై నీవే నాకు తోడైయుంటివయ్యా (2)
నూతన బలమును ఇచ్చి - నూతన మనసును ఇచ్చి -
నీ ఆత్మ శక్తితో నింపిన యేసయ్య (2)
|| యేసయ్య నీకే వందనం ||

2. అంధకార లోయలలో - అలలు ఉన్న అలసటలో -
ప్రేమ కొదువైన లోకంలో నా ప్రార్ధన వింటివయ్యా (2)
నూతన సన్నిధిని ఇచ్చి - నూతన జీవితం ఇచ్చి -
నీ ఆత్మ శక్తితో నింపిన యేసయ్య (2)
|| యేసయ్య నీకే వందనం||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------