Back

Choose Song To View The Lyrics

కృపగల యేసయ్యా నీ కృపయే నాకు ఇలలో ఆధారము నా యేసయ్యా

కృపగల యేసయ్యా నీ కృపయే నాకు
ఇలలో ఆధారము నా యేసయ్యా
ఇలలో ఆధారము (2)
కృపగల యేసయ్యా..ఆ...ఆ....ఆ...ఆ...

నీ కృపే నాపై నిత్యము నిలుచును
నీ కృపే నాకు శాశ్వత జీవము (2)
నీ కృపే నాలో అణువనువున దాగి
నిత్యము నన్ను నడిపించుచున్నది (2)
||కృపగల||

కరుణావాత్సల్యం నాపై చూపితివా
విడువక నన్ను ప్రేమించితివా (2)
ఆశేలేని నా జీవితానికి
ఆశ్రయదుర్గము నీవే అయితివా (2)
||కృపగల||

నీ వాక్యమే నా పాదములకు దీపం
నీ వాక్యమే నా త్రోవకు వెలుగై (2)
గాఢాంధకారములో నే నడచిన వేళ
నిత్యము నన్ను వెన్నంటియున్నది (2)
||కృపగల||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------