Back

Choose Song To View The Lyrics

మారాలి మారాలి నీ మనసే మారాలి

మారాలి మారాలి నీ మనసే మారాలి
ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది

మారారంటూ మారారంటూ వేషం వేస్తారు
ఆ వేషంతోనే లోకాన్నెంతో మోసం వేస్తారు
||మారాలి మారాలి||

నీ జీవితమంతా ఒక్కోసారి పరీక్ష చేయాలి
ఆ పరిక్షలోనే పాపాలన్నీ పెరికి వేయాలి
||మారాలి మారాలి||

క్రీస్తు నామం చాటామంటూ గొప్పలు చెబుతారు
ఆ సాక్ష్యం కాస్తా సాగకపోతే గోతిలో పడతారు
||మారాలి మారాలి||

రోగము కొరకు దేవునికెన్నో మ్రొక్కులు మొక్కుతారు
ఆ రోగము పోతే దేవుని మాట మరచిపోతారు
||మారాలి మారాలి||

నిలకడలేని జీవితమంతా నీలో ఉంచుకొని
ఎదుటి వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తావు
||మారాలి మారాలి||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------