Back

Choose Song To View The Lyrics

మానవాళికై మరణ వేదన పాపము కొరకై ప్రసవ వేదన

మానవాళికై మరణ వేదన
పాపము కొరకై ప్రసవ వేదన
నా శిక్షను భరియించుటకే నా పాపము క్షమియించుటకే (2)
సిలువ వేదన మరణ యాతన మానవాళి రక్షణకై నీ ప్రార్ధన (2)
||మానవాళికై||

దూషణ ద్వేషములు సిలువకు నిన్ను కొట్టగా
కొరడా దెబ్బలు నీ వీపును బహుగా చీల్చగా (2)
మౌనివైతివా మోత్తబడితివా
మరపురాని నీ ప్రేమను చూపితివా (2)
||మానవాళికై||

అపహసించిరి అవమానపరిచిరి నీ వస్త్రమును చీట్లు వేసిరి
ఉమ్మి వేసిరి మేకులను కొట్టిరి ముళ్ళ కిరీటం తలకు గుచ్చిరి (2)
బదులు పలుకలేదు నోరు తెరువలేదు
నలుగగొట్టబడుటకు ఇష్టపడితివి (2)
||మానవాళికై||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-----------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Pastor Ravi Kumar Mukthupudi
Vocals & Music : Nissy John & Sandeep Kumar Velicharla
-----------------------------------------------------------------------------------------