Back

Choose Song To View The Lyrics

మహా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా

మహా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా (2)
ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా
నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా
||మహామహిమతో||

మహిమను విడిచి భువిపైకి దిగివచ్చి - కరుణతో నను పిలిచి
సత్యమును బోధించి చీకటిని తొలగించి - వెలుగుతో నింపితివి (2)
సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక
స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు (2)
||మహామహిమతో||

కరములు చాచి జలరాసులలోనుండి - నను లేవనెత్తితివి
క్షేమమును దయచేసి నను వెంబడించి అనుదినము కాచితివి (2)
అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు
నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు (2)
||మహామహిమతో||

పదివేలలోన గుర్తించదగిన - సుందరుడవు నీవు
అపరంజి పాదములు - అగ్ని నేత్రములు - కలిగిన వాడవు (2)
ఉన్నతుడా - మహోన్నతుడా - ఆరాధించెదను-
రక్షకుడా - ప్రభాకరుడా - నిను ఆరాధించెదను (2)
||మహామహిమతో||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **